ఈ ఒక స్పూన్ తాగితే అజీర్ణం, మలబద్దకం, కడుపునొప్పి అమాంతం తగ్గిపోతాయి

By | February 9, 2022

మన అజీర్తి చేసినపుడు కానీ, ఎక్కువగా మసాలా లేదా మాంసాహారం తిన్నపుడు కానీ పొట్టలో నొప్పి వస్తుంది. అంతేకాకుండా సరిఅయిన సమయంలో తినకపోతే పొట్టలో గ్యాస్ ఫార్మ్ అయి కూడా పొట్ట నొప్పి వస్తుంది. ఈ గ్యాస్ ఎక్కువ అయి వచ్చే కడుపు నొప్పిని మనం ఇంట్లో వాడే దినుసులతో యిట్టె ఐదు నిమిషాలలో తగ్గించుకోవచ్చు.

దానికి కావలసినవి ఒక చెంచా వామును మరియు మరొక చెంచా సైన్ధవా లవణం తీసుకొని రెండింటిని కలిపి కొద్దిగా నలగ గొట్టి నొప్పి వస్తున్న సమయంలో నోట్లో వేసుకొని కొద్దికొద్దిగా మింగుతూ ఉంటూ చివరగా పావు గ్లాసు గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా చేస్తే కడుపు నొప్పి ఐదు నిమిషాల్లో తగ్గుతుంది.

వాము వలన ప్రయోజనాలు:

  1. గ్యాస్ ప్రాబ్లెమ్, అజీర్తి సమస్యలకు బాగా పనిచేస్తుంది.
  2. కడుపు నొప్పిని నివారిస్తుంది.
  3. చిన్న పిల్లల తల్లులకు పాలు ఎక్కువ రావటానికి సహాయపడుతుంది.
  4. జలుబు, దగ్గు మరియు ఉబ్బసంను తగ్గిస్తుంది.
  5. కడుపులో నులి పురుగులకు, మలబద్దకం నివారిస్తుంది.
  6. కీళ్లవాపుకు, రక్తం పల్చబరుచుటకు ఇది సహాయపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *