షుగర్ వ్యాధిని ఎలా చేస్తే ఈజీగా తగ్గించుకోవచ్చు తెలుసుకోండి ఇలా.

By | July 4, 2022

షుగర్ వ్యాధి అనేది ఒకసారి వస్తే పోవటం కష్టం అని, జీవితాంతం మందులు వాడాలని, ఈ వ్యాధిని తగ్గించుకునే మార్గం లేదని డాక్టర్స్ అంటుంటారు. ఈ వ్యాధి అనేది వంశ్యపార్యపరంగా వస్తుందని అంటారు. దీనిలో నిజం ఉన్నప్పటికినీ, మనం కొన్ని రకాల ఆహార నియమాలు, అలవాట్లు, పద్ధతులు పాటించటం వలన ఈ షుగర్ వ్యాధిని నయం చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది.

మనలో చాలావరకు ఒక అపోహ ఉంది స్వీట్స్ తింటేనే షుగర్ వస్తుందని, స్వీట్స్ తగ్గిస్తే షుగర్ తగ్గుతుందని స్వీట్స్ తినటం మానేస్తారు. అది కాదు నిజం. మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవటం వలన షుగర్ వ్యాధి వస్తుంది. అంటే మనం తిన్న ఆహారం జీర్ణం అయినా తర్వాత అది గ్లూకోస్ ను రక్తంలోకి విడుదల చేస్తుంది. అది మన శరీర అవసారిణికి మించి ఉంటె షుగర్ వ్యాధి వస్తుంది.

గ్లూకోస్ నిల్వలను మనం ఏదైనా శారీరక శ్రమ చేసి కరిగించవచ్చు. కానీ ఇప్పుడున్నా కాలంలో ప్రతి పనికి పని మనుషులను పెట్టటం లేదా మెషిన్ వాడటం వలన గ్లూకోస్ నిల్వలు మన శరీరంలో అలాగే ఉండి పోతున్నాయి. దాన్ని తగ్గించటానికి మనం టాబ్లెట్స్ వేసుకుంటున్నం అంతే. షుగర్ వ్యాధి తగ్గడానికి లేదా రాకుండా ఉండటానికి మనం కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తక్కువగా తీసుకోవాలి. అన్నం, వారి పిండితో చేసిన ఆహారాలు, ఇడ్లి, ఉప్మా ఇలాంటి తగ్గించాలి.

ఉదయం అల్పాహారంలో మొలకెత్తిన గింజలు, ఏదైనా జావా ఇలా తీసుకోండి. మధ్యాహ్నం అన్నం తక్కువ తీసుకొని కూర ఎక్కువగా తీసుకోండి దానిలో రొట్టె కలిపి తినండి. రాత్రి అన్నం కాకుండా చిరు ధాన్యాలు లేదా డ్రై ఫ్రూప్ట్స్, ఫ్రూప్ట్స్ తినండి. ఇలా చేయటం వలన మన బాడీలోకి గ్లూకోస్ శాతం తక్కువ చేరి మాత్రా అవసరం లేకుండా చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *