ఇలా చేస్తే శరీరంలో ఉన్న యూరిక్ ఆసిడ్ ని తగ్గించడం తో పాటు అరి కాళ్ళ మంటలు , మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి

By | July 1, 2022

మనం ఏదైనా ఆహారం తింటే అది జీర్ణం అయి మనకు అనేక రకాల పోషక విలువలను, విటమిన్స్, మినరల్స్ అందిస్తుంది. అందులో ఒక భాగం యూరిక్ ఆసిడ్. ఈ యూరిక్ ఆసిడ్ మన శరీరం వినియోగించుకోగా వచ్చిన దానిని రక్తం ద్వారా కిడ్నీల నుండి యూరిన్ రూపం లో బయకు పంపిస్తుంది. ఐతే మన శరీరంలో యూరిక్ ఆసిడ్ ఎక్కువైతే అది బయటకు వెళ్లకుండా చిన్న చిన్న యూరిక్ ఆసిడ్ స్పటికాలుగ ఏర్పడి కీళ్ల మధ్య, జాయింట్స్ మధ్య చేరి వాపును, నొప్పిని కలుగ చేస్తాయి. అలానే వదిలేస్తే కీళ్ల కదలికలు కూడా కష్టం అవుతాయి.

యూరిక్ ఆసిడ్ ఎక్కువైతే కిడ్నీల పని తీరు కూడా మందగిస్తుంది. దీర్ఘకాలికంగా ఇలా యూరిక్ ఆసిడ్ ఎక్కువైతే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.

మనకు బయట చాలా సులభంగా దొరికే సొరకాయ ను ఉపయోగించి మన శరీరంలో పేరుకు పోయిన చెడు పదార్దాలు మరియు యూరిక్ ఆసిడ్ ని తగ్గించవచ్చు . సొరకాయ జ్యూస్ తీసుకోవడం వాళ్ళ మంచి ఫలితం ఉంటుంది .

తిప్పతీగ కూడా కూడా యూరిక్ ఆసిడ్ ఎక్కువ అవ్వడం వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు , జాయింట్ నొప్పులను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మన రోగనిరోధక శక్తి ని కూడా బాగా మెరుగుపరుస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *