ఉదయాన్నే దీంట్లో కాస్త ఖర్జురా పొడి వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది

By | October 30, 2021

మన శరీరాన్ని రోగాల నుండి కాపాడే రక్షణ కణాలను తెల్ల రక్త కణాలు (White blood Cells ) అని అంటారు. తెల్ల రక్త కణాలు మనకు అనారోగ్యాన్ని కలిగించే వైరస్ మరియు బాక్టీరియా తో పోరాడి వాటిని అంతం చేసి మన ఆరోగ్య వ్యవస్థ కు ఒక రక్షణ వలయంగా ఉంటాయి . ఒక దేశానికి సైనిక వ్యవస్థ ఎంత అవసరమో మన శరీరానికి కూడ తెల్ల రక్త కణాలు అంత అవసరం.

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు . ఇలాంటి జ్వరం వచ్చినప్పుడు ఈ తెల్ల రక్త కణాల అవసరం ఎంతో ఉంటుంది . మాములుగా ఈ తెల్ల రక్త కణాల సంఖ్య అనేది 4000 నుండి 11000 మధ్య ఉండాలి.

మనం కొన్ని రకాల ఆహార పదార్దాలు తీసుకోవడం వల్ల వీటిని పెంచుకోవచ్చు . తెల్ల రక్త కణాలు అనేవి మన శరిరంలో తగ్గినప్పుడు తొందరగా జీర్ణం అయ్యే పండ్లు మరియు పండ్ల రసాలను తీసుకోవాలి . ముఖ్యంగా బొప్పాయి అనేది ఈ తెల్ల రక్త కణాల ను పెంచడంలో ఎంతో బాగా ఉపయోగ పడుతుంది . అంతేకాకుండా బొప్పాయి ఆకుల రసం కూడా ఈ తెల్ల రక్త కణాల ను తొందరగా పెంచుతుంది.

విటమిన్ C ఎక్కువగా ఉండే ఆహార పదార్దాలను తీసుకోవాలి . అంటే బత్తాయి రసం , జమ పండ్లు తింటే మంచి ఫలితం ఉంటుంది . పొద్దున్నే కాస్త ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక ముక్క నిమ్మరసం మరియు తేనె కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన శరీరంలో వున్న హానికర క్రిములను మరియు రసాయనాలను అంతం చేయడంలో ఎంతో బాగా సహాయ పడతాయి . గ్రీన్ టీ , అల్లం , ద్రాక్ష పండ్లు తీసుకోవడం వల్ల మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *