ఇవి తింటే విరిగిన ఎముకలను బలంగా చేసి మీ శరీరంలో వుండే కాల్షియం లోపం తగ్గించి దృడంగా చేస్తుంది

By | October 25, 2021

ఈ రోజుల్లో చాల మంది మోకాళ్ళ నొప్పులు , నరాల బలహీనత , అలసట తో బాధపడుతున్నారు . అలాంటి వారు రోజు తినే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . కాల్షియం ఎక్కువ వున్నా ఆహార పదార్దాలు తీసుకోవడం , కాస్త ఎండలో ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం తిన్న ఆహారంలో వున్న కాల్షియం ను శరీరం గ్రహించాలంటే D విటమిన్ ఎంతో అవసరం.

మన ఇంట్లో దొరికే నల్ల నువ్వులు, గసగసాలు మరియు తామర గింజలను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . తామర గింజలను ఫూల్ మఖానీ అని కూడా అంటారు ఇవి అన్ని సూపర్ మార్కెట్ మరియు ఆయుర్వేద షాప్ లలో దొరుకుతాయి.

నల్ల నువ్వుల (Black sesame ) నుండి తీసిన నూనె ను కూడా చాలా వంటల్లో ఉపయోగిస్తారు. నువ్వుల నూనె వాడడం వల్ల కాల్షియం లోపం నివారిస్తుంది. పచ్చళ్ళ (Pickles) లో కూడా నువ్వుల నూనె వాడడం వల్ల మంచి రుచి కూడా ఉంటుంది. నల్ల నువ్వులను వాడడం వల్ల కాలేయం ఫై వున్న ఒత్తిడి తగ్గించడం తో పాటు బరువు ను అదుపులో ఉంచుతుంది.

నువ్వులలో యాంటీ యాక్సిడెంట్ లు ఎక్కువగా ఉండడం వల్ల కాన్సర్ నిరోధకంగా బాగా పనిచేస్తుంది .ఇంకా చర్మ సౌందర్యనికి బాగా ఉపయోగపడం తో పాటు జుట్టు పెరగడానికి , కుదుళ్ళ దృఢత్వానికి బాగా సహాయ పడుతుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *