ఇంట్లో ఆడవాళ్లు ఆరోగ్యంగా ఉంటె ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉంటుంది అనే సామెత ఊరికే అనలేదు. కానీ ఈ రోజుల్లో ఆడవారి జీవన శైలిలో మార్పు రావటం వలన వారి వారి ఆరోగ్యంలో చాల సమస్యలు తలెత్తుతున్నాయి. ఆడవారి ఆరోగ్యంలో శ్రద్ధ వహించాలంటే ముందుగా వారిని మూడు రకాలుగా యువతులు అంటే రుతుక్రమం మొదలైన వారిని , మధ్య వయస్కులు అంటే పిల్లలు పుట్టిన వారిని, వృద్దులు అంటే రుతుక్రమం చివరి దశలో ఉన్న వారిగ విభచించి, వారి వయస్సుకు తగ్గట్టు ఆహారం మరియు జాగర్తలు తీసుకోవాలి.
11 నుండి 13 సంవత్సరాల పిల్లలు అపుడే మెచూర్ అవుతారు కావున, వారిలో శారీరకంగా మరియు మానసికముగా చాల మార్పులు వస్తాయి ఇంకా హార్మోనల్ చేంజెస్ కూడా వస్తాయి. కావున వీరికి ఈ వయస్సులో బలం మరియు ఏకాగ్రత చాల అవసరం కాబట్టి వీరికి విటమిన్ డ్ లోపం ఉందొ లేదో చెక్ చేయాలి. ఈ లోపానికి నువ్వుల లడ్డు, పాలు ఇస్తూ ఉండాలి. ఒక కే జి బరువుకి 2 గ్రాముల ప్రోటీన్ అవసరం దానికి పిల్లలకు కంది పప్పు, రాజ్మా, మీల్ మేకర్, ఆకూ కూరలు హై ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి. మెమరీ పవర్ కి పచ్చి కొబ్బరి, గుమ్మడి గింజల పప్పు ఇవ్వాలి.
గర్భవతులు మరియు బాలింతలు ఐతే ఇద్దరి కోసం తినాలి కాబ్బట్టి అన్ని పోషక విలువలు ఉన్న ఆహారాన్నే ఎక్కువ తీసుకోవాలి. మొలకెత్తిన గింజలు, ఆకూ కూరలు, డ్రై ఫ్రూప్ట్స్, పండ్లు, కాల్షియమ్ ఎక్కువ ఉన్న ఆహారాలు ఇలా తక్కువగా రోజులో ఎక్కువసార్లు తీసుకోవాలి. మధ్య వయస్కులు, వవృద్దులు ఎక్కువగా ఎముకలు పలుచ పడకుండా, మోకాళ్ళ నొప్పులు రాకుండా కాల్షియమ్ ఎక్కువగా ఉన్న పదార్దాలు అంటే నువ్వుల లడ్డు లాంటివి తీసుకోవాలి. ఎండలో కాసేపు కూర్చోవాలి. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తక్కువ తీసుకోవాలి.