మన శరీరంలో హార్మోన్స్ అనేవి మన మెదడు లోని ఆలోచనలకు తగ్గట్టుగా విడుదల అవుతాయి . మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన మెదడు విడుదలయ్యే హార్మోన్స్ ఎంతో ముఖ్యం . ఇందులో ముఖ్యంగా డోపామైన్ అనే హార్మోన్ ని హ్యాపీ హార్మోను అని పిలుస్తారు . ఇది మన శరీరం ఆరోగ్యంగా , సంతోషంగా , ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది . ఈ మధ్య కాలంలో జరిగిన పరిశోధనలో ఈ డోపామైన్ అనేది కాయ గూరల్లో కూడ ఉంటుందని తెలిసింది .
ముఖ్యంగా మనకు చలి కాలంలో ఎక్కువగా పండే చిక్కుడు కాయ తినడం వల్ల ఈ హార్మోను బాగా ఉత్పత్తి అవుతుంది. చిక్కుడు కాయ తిన్నప్పుడు అది జీర్ణం అయ్యి ఈ హార్మోను విడుదల అయ్యేలా చేస్తుంది .
అంతే కాకుండా చిక్కుడా కాయ కూర అనేది మంచి రుచితో పాటు మనకు మంచి పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది . చిక్కుడుకాయ లో వుండే కాపర్ అనేది మెదడు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగ పడే డోపామైన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవ్వడానికి ఉపయోగపడుతుంది . చిక్కుడుకాయ అధికంగా వుండే పీచు పదార్థం వల్ల జీర్ణ సమస్యలు , డయేరియా లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి .
చిక్కుడు కాయ లో ఉండే మాంగనీస్ అనేది నిద్రరాని వారికీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది . చిక్కుకాయలు మన ఆహారంలో తీసుకోవడం మన ఆకలి కూడా తగ్గుతుంది అందువల్ల బరువు తగ్గాలి అని అనుకొనే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది .