మనిషి ఎంతో ముఖ్యమైన ఆలోచన శక్తి అనేది మెదడు నుంచే కలుగుతుంది . మరి ఆ మెదడును మనం ఎంతో ఆరోగ్యంగా ఉంచాల్సిన అవసరం ఎంతో ఉంది . మీరు తెలుసుకోవాల్సిన ముక్యమైన విషయం ఏంటి అంటే ఉడక పెట్టి తిన్న ఆహార పదార్దాలు అన్ని కూడా మన మెదడు ను మబ్బుగా చేస్తాయి అదే విధంగా సహజంగా తిన్న ఆహారాలు మన మెదడును చురుకుగా పని చేసేలా చేస్తాయి . ఉదాహరణకు ఇడ్లి , పూరి , దోస ని టిఫిన్ లాగ తిన్నప్పుడు మనకు కాస్త మబ్బుగా ఉంటుంది .
మెదడు కణాలు ఒకసారి చని పోయిన లేదా పాడై పోయిన మళ్ళి తిరిగి రావు. మెదడు అనేది ఒక కొవ్వు పదార్థం . అందుకని మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మెదడుకు మంచి చేసే కొవ్వు పదార్దాలు తినడం ఎంతో అవసరం . అందులో ముఖ్యమైనవి వాల్ నట్ , పచ్చి కొబ్బరి . వీటిలో వుండే ఒమేగా ఫాటీ ఆసిడ్స్ అనేవి మెదడు చురుకుగా పని చేసేందుకు ఎంతో సహాయం చేస్తాయి .
వాల్ నట్ అనేది మనకు అన్ని ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుంది . దీనిని రోజు పొద్దున్న , సాయంత్రం తినవచ్చు . ఇంకా కొబ్బరి కూడా అనేక రకాలుగా తినవచ్చు . కొబ్బరిని పచ్చళ్ళ రూపంలో , పచ్చి కొబ్బరిని పాలు లాగ చేసి చిన్న పిల్లలకి తాపించవచ్చు . ఇంకా బాగా ముదిరిన కొబ్బరి బొండం తాగి అందులో వుండే కొబ్బరిని తినడం వల్ల కూడ మంచి ప్రయోజనం కలుగుతుంది .