ఈ విధంగా చేసిన నూనెను వాడడం వల్ల మీ జుట్టు నల్లగా మరియు దృడంగా మారుతుంది

By | September 14, 2021

ఈ రోజుల్లో మంది జుట్టు తెల్లగా అవ్వడం , జుట్టు రాలి పోయి బట్ట తల రావడం లాంటి సమస్యలతో భాద పడుతున్నారు. మారిన ఆహార అలవాట్లు , కలుషితమైన గాలి మరియు తల స్నానం చేసినప్పుడు వాడే షాంపూలు కూడా అందుకు ప్రధాన కారణాలు .

మనం కొన్ని పదార్దాలను ఉపయోగించి నూనెను తయారు చేసుకుందాం . అందుకు మనకు కావాల్సినవి ఆవాల నూనె, గోరింటాకు పొడి, మెంతులు, నల్ల జీలకర్ర .

ఆవ నూనె అనేది మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది . ఆవ నూనె అనేది జుట్టు పొడిబారి పోయి రాలిపోకుండా ఉంచుతుంది . అంతే కాకుండా ఈ ఆవనూనె లో గోరింటాకు కలిపి వాడడం వల్ల ఇంకా మంచి ప్రయోజనం కలుగుతుంది. ఆవ నూనె లో గోరింటాకు వేసి గోరువెచ్చగా వేడి చేసి ఆ నూనెతో తలపై మసాజ్ చేయడం వల్ల చుండ్రును నివారించడం తో పాటు జుట్టును దృడంగా చేస్తుంది .

మెంతులు అనేవి రుచికి చేదుగా ఉన్నా సరే శరీరానికి మాత్రం చాలా రకాలుగా మేలు చేస్తుంది . మెంతులను తినడం వల్ల శరీరానికి కాల్షియం , ఐరన్ తో పాటు బి 1, బి 2 విటమిన్ ఉండడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది . మన ఇంట్లో లభించే మెంతులతో చాలా రకాల జుట్టు సమస్యలకు నివారించవచ్చు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *