ఎముకలు బలంగా ఉండాలంటే మన దేహానికి తగినంత కాల్షియమ్ ఉండాలి. మన కాల్షియమ్ సప్లిమెంట్స్ తీసుకున్న లేదా కాల్షియమ్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పటికిని దానికి తోడు విటమిన్ డ్ ఉంటేనే మన దేహానికి పుష్కలంగా కాల్షియమ్ లభిస్తుంది. ఎముకలు, పళ్ళు బలంగా తయారువుతాయి. విటమిన్ డ్ అనేది సహజసిద్ధంగా సూర్యుడి నుండి వచ్చే కాంతి ద్వారా లభిస్తుంది.
కానీ ఈ రోజుల్లో వివిధ పని వేళల వలన పొద్దున్నే లేవకపోవటం వలన సూర్యకాంతి లభించటం లేదు, ఇంకా ఇరుకైన, ఎత్తైన భవనాల వలన సూర్యకాంతి పడే అవకాశం చాల తక్కువ. సూర్యకాంతి లభించని వారు సూర్యకాంతి పడే నీటిని తాగటం వలన కూడా విటమిన్ డ్ ఈజీగా పొందవచ్చు. ఈ నీటినే సన్ ఛార్జెడు వాటర్ అని అంటారు. చిన్న పిల్లలకు, చదువుకునే పిల్లలకు ఈ విటమిన్ డ్ చాల అవసరం. విటమిన్ డ్ వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
సన్ ఛార్జెడు వాటర్ ని ఎలా తాయారు చేసుకోవాలంటే ఒక గాజు పాత్రా లేదా సీసాలో నీటిని పోసి, ఆ పాత్రా పైన పలుచని కాటన్ బట్ట కట్టి ఎండలో సుమారు 5 నుండి 6 గంటల వరకు ఉంచాలి. దీనికి బావి నీరు కానీ, బోరు నుండి వచ్చే నీరు కానీ, మనకు ఇంటికి వచ్చే ప్రభుత్వపు కుళాయి నీరు మాత్రమే వాడుకోవాలి. మనం ఇంట్లో వాడుకునే ఫిల్టర్ వాటర్ వాడవద్దు. ఈ సన్ ఛార్జెడు వాటర్ తాగటం వలన విటమిన్ డ్ లభిస్తుంది. పొట్టలోని అసిడిటీ, గ్యాస్, అలీసెర్ లాంటి సమస్యలు తగ్గుతాయి. ఈ నీటిని ముఖానికి, కళ్ళకి వాడటం వలన కాంతి వంతంగా తయారువుతాయి. చర్మ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి.