మోకాళ్ళ నొప్పులతో బాధ పడేవారు ఎట్టి పరిస్థితుల్లో 5 రకాల తప్పులను అస్సలు చేయకూడదు . మన శరీరంలో కాల్షియం , విటమిన్ డి సరైన మోతాదులో వుందో లేదో తెలుసుకోకపోవడం , కూర్చునే విధానం నడిచే విధానం లో చేసే తప్పు లను సవరించక పోవడం , నొప్పి తగ్గించే మందులు అధికంగా వాడడం , అధిక బరువును తగ్గించడంలో శ్రద్ధ పెట్టక పోవడం , ఆహార నియమాలను సరిగా పాటించక పోవడం అనేవి మోకాళ్ళ నొప్పులకు ప్రధాన కారణం .
కాల్షియం లోపం అనేది మోకాళ్ళ నొప్పులకు ప్రధాన కారణం కాబట్టి కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్దాలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది . అందుకని నువ్వుల ఉండలు తినడం , ముఖ్యంగా ఆకుకూరలైన తోట కూర , పొనగంటి కూర , మునగాకు , బచ్చలి కూర , మెంతి కూర లాంటివి తీసుకొంటే శరీరానికి కావాల్సిన కాల్షియం పుష్కలంగా లభిస్తుంది .
కాల్షియం శరీరానికి పట్టాలంటే D విటమిన్ ఎంతో అవసరం . ఎండలో ఉండడం సాధ్యం కానీ వారు డాక్టర్ల సలహా మేరకు విటమిన్ టాబులెట్లను వాడడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది .