మన భారతీయ సంప్రదాయంలో ఆడవారు రోజు పూలు పెట్టుకునే ఆనవాయితీ వుంది. కానీ ప్రస్తుత కాలంలో రోజు కాకుండా కేవలం పండుగలు, పూజలు, వ్రతాలు చేసుకుంటపుడు మాత్రమే ఆడవారు పూలు ధరిస్తున్నారు. అయితే ఆడవారు ధరించే పూల మాలలో మరువం లేదా దవనం అనేది చాల ముఖ్యమైనది. ఈ మరువం ఎంతో సువాసన వెదజల్లుతుంది.
ఈ మరువం పెంచటానికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. ఇది చిన్న చిన్న పూల కుండీలలో కూడా పెరుగుతుంది. ఈ మరువం లేదా దవనం వలన ఉపయోగాలు ఉన్నాయి. ఈ మరువం ఆకూ యొక్క వాసన పీలిస్తే ఎంతో రిలాక్స్ అవుతారు.
మరువం లేదా దవనం యొక్క ఉపయోగాలు:
- మరువం ఆకుల యొక్క వాసనా పీలిస్తే డిప్రెషన్ తగ్గుతుంది.
- ఆడవారిలో నెలసరి ముందు వచ్చే మూడ్ స్వింగ్స్ మరువం వాసన పీలిస్తే తగ్గుతాయి.
- మరువం వాసనకు లేదా మరువం పెరిగే చోట దోమలు దరిచేరవు.
- మరువం నూనెను నెలసరి సమయంలో పొత్తికడుపైన రాసుకుంటే ఆ సమయంలో వచ్చే కడుపునొప్పి మరియు నుదుము నొప్పి తగ్గుతుంది.
- మనసు బాగాలేకపోతే మరువం వాసనా పీలిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.