పెరాలిసిస్ ను తెలుగులో పక్షవాతం అని అంటారు. పక్షవాతం అంటే శరీర అవయవాలలో కొన్ని లేదా అన్ని అవయవాలు పూర్తిగా లేదా శాశ్వతంగా పనిచేయకపోవడం. దీనికి గల కారణం మెడకు మరియు కండర నరాలకు మధ్య జరిగే సంకేతాలకు ఏదైనా అంతరాయం జరిగినపుడు పక్షవాతం వస్తుంది. ఈ పక్షవాతం అనేది ఈ మధ్య కాలంలో మన విభిన్న జీవనశైలి వలన చిన్న వయస్సు వారిలో కూడా సంభవిస్తుంది.
పక్షవాతం రావడానికి ప్రధాన కారణాలు:
- మనం తినే ఆహారంలో ఎక్కువగా ఉప్పును ఉపయోగించటం.
- అధిక రక్తపోటు అంటే హైబీపీ వలన మెదడులోని రక్త నాళాలు చిట్లటం.
- హిచోలెస్ట్రాల్ వలన రక్తం చిక్కగా ఉండటం వలన రక్త సరఫరా సాఫీగా జరగపోవటం.
పక్షవాతం వచ్చే కారకాలను మనం తీసుకునే కొన్ని నియమాల వలన అధిగమించవచ్చు.
- రోజుకి 4 లీటర్లు నీళ్లు తాగాలి. దీని వలన ఎక్కువగా తీసుకున్న ఉప్ప్పు చమట లేదా మూత్రం రూపంలో బయటకు వెళుతుంది.
- మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఆర్గానిక్ అంటే సహజసిద్ధంగా పండే పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు తీసుకోవటం వలన హైబీపీ కానీ, హైచోలెస్ట్రాల్ రాదు.