ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న దానికి మందు బిళ్లలను వేసుకొని మన దేహాన్ని మనమే పాడు చేస్తున్నాము. ఇలా మందు బిళ్లలను అతీగగా వాడటం వలన ఒక సమస్య తగ్గినా వేరొక సమస్య మొదలవుతుంది. అదే ఆయుర్వేదంలో ఒక చిన్న మొక్క ఉపయోగించి 20 రోగాలను నయం చేయవచ్చు, కానీ మొక్కను ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క పదార్థం వాడి నయం చేసుకోవచ్చు. అదే సోనాముఖి మొక్క. ఈ మొక్కను పొడి చేసుకొని ఆరు నెలల నుండి సంవత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చు.
ఒక గ్లాస్ పెరుగులో 2 లేదా 3 చిటికెల సోనాముఖి పొడి, కొంచెం చక్కర కలిపి ఉదయం, సాయంత్రం తాగితే నరాల బలహీనత తగ్గుతుంది. ఎండు ఖర్జురా, సోనాముఖి పొడి కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ కడుపు నొప్పి తగ్గుతుంది. ద్రాక్ష రసంలో 2 లేదా 3 చిటికెల సోనాముఖి పొడి కలిపి తీసుకుంటే ముడతలు తగ్గుతాయి . అట్లసారపాకు రసంలో సోనాముఖి పొడి కలిపి తాగితే కంటి దోషాలు, శుక్లాలు తగ్గుతాయి.
నెల ఉసిరిక రసంలో సోనాముఖి పొడి కలిపి తాగితే పిత్త వ్యాధులు తగ్గుతాయి. మామిడి చెక్క రసంలో సోనాముఖి పొడి కలిపి తాగితే పాండు రోగం అంటే బోధ కాలు తగ్గుతుంది. సంతానలేమి సమస్యలు ఉన్న ఆడవారు పీరియడ్స్ మొదలైన 5 డేస్ లేదా ఒక నెల వరకు నేల ఉసిరిక రసంలో సోనాముఖి పొడి కలిపి తాగి గర్భంలో నీటి బుడగలు, వేరే సమస్యలు తగ్గుతాయి. ఆవు నెయ్యిలో సోనాముఖి పొడి కలిపి తీసుకుంటే పొడి దగ్గు తగ్గుతుంది.