ఈ ఒక్క లేత ఆకు ను తింటే మన పొట్ట మొత్తం క్లీన్ అయ్యి జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది

By | July 16, 2021

పూర్వ కాలం నుండి మన ఋషు లు పెట్టిన ప్రతి ఆహార నియమాల వెనుక మంచి ప్రయోజనం వుంది . మన ఇంట్లో మనం ఏదైనా శుభ కార్యాలు చేసుకున్నప్పుడు మన బంధువులను అందరిని పిలుస్తాము . శుభ కార్యాల్లో రోజు తినే ఆహార పదార్దాలు కాకూండా అనేక రకాల పిండి వంటల తో పాటు నూనె తో చేసిన ఆహారాన్ని పెడతాము . ఈ ఆహారం అనేది మన జీర్ణ వ్యవస్థకు కాస్త భారం గా మారుతుంది . అందుకని చివరలో తాంబూలాన్ని ఇస్తాం. తాంబులం అంటే తమల పాకు లో కాస్త వక్క మరియు సున్నం కలిపి ఇచ్చేవారు . ఈ తమల పాకు లను ప్రతి శుభ కార్యాల్లో వాడతాం .

మరి ఈ తమల పాకు ఎందుకు తినాలంటే ఇది మన మనం తిన్న ఆహారాన్ని అరిగించడంలో మన జీర్ణ వ్యవస్థకు ఎంతో బాగా సహాయ పడుతుంది . తమల పాకు అనేది మన పేగు , పొట్టలో మ్యూకస్ క్రియేషన్ ని పెంచుతుంది . దీని వల్ల మన పొట్టలో ఆహారం అరగడానికి కావాల్సిన జిగురు ను విడుదల చేస్తాయి . అంతే కాకుండా మన కాలేయంలో పేరుకుపోయిన హానికర రసాయనాలను కూడ తొలిగింస్తుంది .

తమలపాకు వల్ల మన పేగులు విటమిన్ల ను , పోషకాలను కూడ తొందరగా గ్రహిస్తాయి .
దగ్గు , జలుబు లాంటి సమస్యలకు కూడ ఈ తమలపాకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది . రక్త ప్రసరణను కూడ అదుపులో ఉంచుతుంది . ఈ తమలపాకు లో వున్న యాంటీ ఫంగల్ లక్షణాల కలిగి ఉండడం వల్ల ఈ ఆకు ను ఇన్ఫెక్షన్ వున్న చోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది . తమలపాకు నోటి ఆరోగ్యాన్ని కూడ కాపాడడం తో పాటు నోటి దుర్వాసనను , పంటి నొప్పిని కూడ తగ్గిస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *