ఈ రోజుల్లో కంటి చూపు చిన్న చిన్న పిల్లల్లో మందగించటం, పెద్ద పెద్ద కళ్లద్దాలు వాడటం అనేది సర్వసాధారణం ఐనది. ఎక్కువసేపు టీవీ చూడటం, ఫోన్ వాడటం , కంప్యూటర్ వర్క్ ఎక్కువగా చేయటం వలన కంటిలో చాల సమస్యలు ఏర్పడుతాయి. దీనికి కేవలం మనం కొన్ని పదార్దాలు వాడి నెల రోజుల్లో కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. ఆ పదార్దాలుఏంటంటె తెల్ల మిరియాలు, బాదాం పప్పు, సోంపు, యాలకులు మరియు పేటికబెల్లం.
50 గ్రాముల బాదాం, 50 గ్రాముల సోంపు, 10 గ్రాముల తెల్ల మిరియాలు, 10 గ్రాముల యాలకులు, 100 గ్రాముల పటిక బెల్లం తీసుకొని మెత్తగా పొడిచేసుకోవాలి. ఈ పొడిని ఉదయం అల్పాహారం తినక అర గంట తర్వాత కానీ, రాత్రి పడుకునే అర గంట ముందు కానీ ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో కలుపు కొని త్రాగాలి. ఈ నెల రోజుల వరకు క్రమం తప్పకుండ త్రాగితే కండ్ల మంట, కండ్ల ఎరుపు, కండ్ల నొప్పి, కండ్ల వెంట నీరు రావటం వంటి సమస్యలు తగ్గి కంటి చూపు మెరుగుఅవుతుంది.
మిరియాలు, బాదాం పప్పు, సోంపు అనేవి కంటి చూపును మెరుగుపరచటమే కాకుండా మెదడు శక్తిని పెంచుతాయి. బాదాం జ్ఞపకా శక్తిని, యెవ్వన్నని పెంచుతాయి. సోంపు అనేది అని జీర్ణ సమస్యలకు బాగా పనిచేస్తుంది, యాలకులు నోటి దుర్వాసనను, ఆస్తమా లాంటి వ్యాధులను నయం చేస్తుంది. పటిక బెల్లం అనేది వంటికి చలవ చేస్తుంది, వీటి అన్నింటిలో ఐరన్, కాల్షియమ్, ఫైబర్ బాగా ఉంటాయి. దాని వాళ్ళ ఎముకలు కూడా బలం గ అవుతాయి.