ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు పెద్దలు. ఉల్లి అనేది దేహం లోపల, బయట బాగా పనిచేస్తుంది. ఐతే ఉల్లి అనేది జుట్టు సమస్యలకు చాల బాగా పని చేస్తుంది. ఈ మధ్య కాలంలో జుట్టు అనేది బాగా ఉడటం అనేది పొల్యూషన్ వల్లనో, విటమిన్స్ లోపం వలనో, స్ట్రెస్, నిద్ర లేమి వలన, హార్మోన్ ఇంబ్యాలన్సు వలన, ఇతర మందుల వాడకం వలన మరియు ఇతర కారణాల జరుగుతుంది.
ఉల్లి వలన జుట్టు బాగా పెరుగుతుంది అని ఇరాక్ లోని యూనివర్సిటీ అఫ్ బాగ్దాద్ కాలేజీ అఫ్ మెడిసిన్ 2002 సంవత్సరంలో క్లినికల్లీ ప్రూవ్ చేసారు. ఉల్లిపాయతో సల్ఫేర్ అనేది చాల ఎక్కువగా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు కేరాటిన్ అనే ప్రోటీన్ చాల అవసరం. ఈ ప్రోటీన్ అనేది కెరాటినోసైట్స్ నుండి ఉత్పత్తి అవుతుంది. ఉల్లి లో ఉండే సల్ఫేర్ అనేది ఈ కేరాటిన్ అనే ప్రోటీన్ను కెరాటినోసైట్స్ నుండి బాగా ఉత్పత్తి చేయడానికి హెల్ప్ చేసి హెయిర్ గ్రోత్ బాగా పెంచుతుంది.
ఉల్లి లో ఉండే సల్ఫేర్ అనేది మాడు కింద కొల్లాజెన్ అనే కణజాలాన్ని చాల బలంగా ఉంచి కుదుళ్ళు కూడా గట్టిగ ఉండేలా చేసి జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. ఉల్లిలో క్యాంపేరోల్, ఖ్వర్సటీన్ అనే కెమికల్స్ కుదుళ్లకు బాగా రక్తప్రసరణ, విటమిన్స్, మినరల్స్ అందేలా చేస్తాయి. ఉల్లి లో ఉండే సల్ఫేర్, అమోనియా వలన జుట్టులో ఉండే ఇన్ఫెక్షన్స్, చుండ్రు, చమట వాళ్ళ వచ్చే ఏవైనా ఇంఫెక్టన్స్ రాకుండా చేస్తుంది. రోజు లేదా వారానికి మూడు సార్లు ఉల్లిపాయను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి దాన్ని జుట్టు కుదుళ్లకు బాగా ఇంకెలా మర్దన చేసి అరగంట తర్వాత తల స్నానం చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది.