నరాల బలహీనత లను , నీరసాన్ని తరిమి కొట్టాలంటే ఒక్కసారి ఇవి తిని చూడండి .

By | August 31, 2021

మన శరీరానికి B కాంప్లెక్ విటమిన్ అనేది బలానికి , నరాలు పనిచేయడానికి , కణాలు పనితీరుకు , అనేక రకాల జీవక్రియలను నడిపించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది . అయితే B కాంప్లెక్ విటమిన్ అనేది ధాన్యాలు , పప్పుల లో వుండే ఫై పొరలో ఎక్కువగా ఉంటుంది . ఎక్కువ పాలిష్ పట్టిన బియ్యం, పప్పులు తినడం వల్ల ఈ B కాంప్లెక్ విటమిన్ అనేది మన శరీరానికి కావాల్సినంత దొరకదు .

అయితే పాలిష్ పట్టని ధాన్యాలు , పప్పులు తిన్న సరే కొంత మందిలో B విటమిన్ లోపం అనేది వస్తుంది . ఆ విటమిన్ ఏంటి అంటే B 12 విటమిన్.
B 12 విటమిన్ లోపిస్తే అరి కాళ్లలో మంటలు , చేతుల చివరి బాగాన మంటలు, నీరసం గా అనిపించడం , జుట్టు ఎక్కువ ఊడడం అనేవి వస్తాయి. B 12 విటమిన్ అనేది మాంస హార సంబంధిత ఆహార పదార్దాలలో ఎక్కువగా ఉంటుంది . అందుకే మాంస హరు లలో B 12 విటమిన్ లోపం అనేది రాదు .
అయితే శాఖాహారం తిని B 12 విటమిన్ని పొందాలంటే మనం పుట్ట గొడుగులను , పాల కూరను , సోయాబీన్ ను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం జరుగుతుంది

One thought on “నరాల బలహీనత లను , నీరసాన్ని తరిమి కొట్టాలంటే ఒక్కసారి ఇవి తిని చూడండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *