దీన్ని వాడి చూడండి మీకు వెన్ను నొప్పి , శరీర అలసట , కొలెస్ట్రాలు ఒత్తిడి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది

By | March 10, 2022

మన ఆయుర్వేదంలో బిర్యానీ ఆకుకు చాల ప్రత్యేకత ఉంది. దీన్ని ఆంగ్లంలో బే లీఫ్ అంటారు. బిర్యానీ ఆకులో చాల ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఆంటీ బ్యాక్టీరియల్, ఆంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఈ గుణాల వలన అధిక బరువు, దంత సమస్యలు, గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు, షుగరు, శ్యాస సమస్యలు నివారించడంలో సహాయ పడతాయి. నిద్ర లేమి సమస్యను తొందరగా తగ్గుతుంది.

ఫోలిక్ ఆసిడ్ అనేది బిర్యానీ ఆకులో అధికంగా ఉంటుంది ఈ ఫోలిక్ యాసిడ్ అనేది గర్భిణీ స్త్రీలకు ఎంతో ముఖ్యమైన పోషకాలలో ఒకటి. బిర్యానీ వంటకాలలో ఈ ఆకును తప్పని సరిగా వాడుతారు దీనివల్ల మంచి రుచి తో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బిర్యానీ ఆకు జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేసేలా చేస్తుంది .

బిర్యానీ ఆకులో వుండే లైనూల్స్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒత్తిడి హార్మోన్లను క్రమబద్దీకరిస్తాయి . షుగర్ ఉన్న వారు కూడా ఈ బిర్యాని ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *