చీపురు ఏ రోజు కొనాలి, ఎక్కడ ఉంచాలి, ఎలా పెట్టాలి. ఎలా పడితే ఆలా పెడితే దారిద్రదేవి ఇంట్లోకి వస్తుంది.

By | November 25, 2023

చీపురు అనేది మన ఇంట్లో చాల ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. పెద్దలు చీపురును లష్మిదేవితో పోలుస్తారు. అందుకే చీపురును కాలితో తాకరాదు, తన్నరాదు అంటారు. ఒకవేళ పొరపాటున కాలికి తగిలిన దానికి దండం పెట్టమంటారు. లక్ష్మి దేవి మరియు జేష్ఠ దేవి అక్క చెల్లెళ్ళు. లక్ష్మి దేవి శుభ్రతకు రూపం అయితే జేష్ఠ దేవి అశుభ్రతకి ప్రతిరూపం. ఇంట్లో ఉండే బూజు, చెత్త జేష్టాదేవి మనం క్లీన్ చేసి పారద్రోలేది చీపురు లక్మిదేవి. అందుకే లక్ష్మిదేవి ఉన్న చోట జేష్ఠ దేవి ఉండదు. జేష్ఠ దేవి ఉన్న చోట లక్ష్మిదేవి ఉండదు.

మనం ఇండ్లలాల్లో వాడివి రెండు రెండు చీపుర్లు. అవి కొండా చీపురు మరియు కొబ్బరి పుల్లల చీపురు. ఈ కొబ్బరి పుల్లల చీపురును ఎక్కువగా బాత్రూమ్స్, బయట వాకిలి, ఇల్లు కడగటానికి, బట్టలు పిండక, గిన్నెలు తోమాక కడగటానికి ఎక్కువగా వాడతారు. ఇక కొండా చీపురును కేవలం ఇంటి లోపల ఊడ్చడానికి వాడతారు. కొబ్బరి పుల్లల చీపురుకి ఎక్కువగా మలినాలు ఉంటాయి కాబట్టి ఈ రెండు చీపుర్లనుఁ ఒకే దగ్గర పెట్టకూడదు. చీపురును ఈశాన్య మూలా పెట్టరాదు.

చీపురును ఈశాన్య మూలా పెట్టరాదు చీపురును ఈశాన్య మూలా, ఆగ్నేయ మూలా మరియు తూర్పు గోడకు పెట్టరాదు. గుమ్మానికి ఎదురుగా, ఇంట్లోకి వచ్చేటపుడు చీపురు కనబడేటట్టుగా పెట్టకూడదు. బీరువా పక్కన పెట్టకూడదు. మైల పడిన ఇంటిలో వాడిన చీపురును, శవాన్ని ఉంచిన ప్లేస్ క్లీన్ చేసిన చీపురును వెంటనే పడవేయాలి. చీపురును మంగళవారం, శుక్రవారం బయట పడవేయరాదు. చీపురును తిర్గేసి పెట్టడం, లేదా పడుకోబెట్టడం మంచిది. శనివారం, ధనత్రయోదశి నాడు చీపురు కొంటె మంచిది. చీపురు, చెత్త చాట కూడా పక్కపక్కన పెట్టకూడదు. చీపురు దానం ఇవ్వరాదు. ఒక చీపురును 2-3 నెలల తరవాత మార్చాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *