కీళ్ల నొప్పులు, అలసటగా లేదా నీరసంగా ఉండటం, రక్తం తక్కువగా ఉండటం,నిద్రలేమి, కాల్షియమ్ లోపము వలన ఎముకలు బలహీనంగా మారటం, ఎముకల్లో గుజ్జు అరిగిపోయి క్లిక్ మని శబ్దం రావటం లాంటి సమస్యలకు ఒక మంచి చిట్కా ఉపయోగించి ఈజీగా పైన చూపిన వాటిని దూరం చేసుకోవచ్చు. వాటికీ కావలసినవి కేవలం గసగసాలు, నువ్వులు, బాదాం పప్పు.
గసగసాలలో ప్రోటీన్స్, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయ్. గసగసాలు వాడితే కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వెన్నుముక సమస్యల నుండి ఉపశమనం కలుగు తుంది. నువ్వులు కాల్షియమ్ లోపాన్ని నివారిస్తాయి మరియు ఎముకలను గట్టిపడేలా చేస్తాయి. ఇంకా ఎముకల్లో గుజ్జును పెంచుతాయి. బాదాం పప్పు జ్ఞాపక శక్తిని పెంచుతాయి మరియు కంటి చూపును బాగా పెంచుతాయి.
గసగసాలు, నువ్వులు, బాదాం పప్పు. ఒక మిక్సీ జార్లో 4 స్పూన్స్ నల్ల లేదా తెల్ల నువ్వులు, 1 స్పూన్ గసగసాలు, 20 వరకు బాదాం పప్పులు తీసుకుని మెత్తని పొడి చేసుకోవాలి. ఈ పొడిని 2 స్పూన్స్ ఒక గ్లాస్ పాలల్లో వేసి మరిగించి పడుకునే అరా గంట ముందు లేదా ఉదయం అల్పాహారం తీసుకున్నాక తాగాలి. రుచి కోసం ఈ పాలల్లో పాతిక బెల్లం లేదా బెల్లం వేసుకోవచ్చు. అయితే గర్భవతులు, కిడ్నీ ప్రాబ్లెమ్ ఉన్నవారు, యూరిక్ ఆసిడ్ ఎక్కువ ఉన్నవారు ఈ పాలను తీసుకోవద్దు.