కార్తీక సోమవారం రోజు ఈ కధ వింటే చాలు ఎన్ని కోట్ల పాపాలైన యిట్టె పోతాయి.

By | November 20, 2023

కార్తీక మాసం వచ్చిందంటే చాలు నది స్నానాలు, పూజలు, వ్రతాలు, నోములు. కార్తీక మాసం చాల విశిష్టమైనది. . కార్తీక సోమవారం శివపూజ చేస్తే వెయ్యి అశ్వమేధాల యాగం చేసిన ఫలితం వస్తుంది. కార్తీక సోమవారం ఎలా చేయాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉదయం నదిస్నానం చేసి శివపూజ చేసి పగలంతా ఉపవాసం సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి తులసి నీళ్లు తాగి మరునాడు పూజ తర్వాత భోజనం చేయాలి. మొత్తం ఉపసం ఉండలేని వారు ఉదయం పూజ తర్వాత మధ్యాహ్నం కానీ లేదా రాత్రి కానీ భోజనం చేయవచ్చు. ఆలా కూడా కుదరని వారు నదిస్నానం చేసి శివపూజ చేసి శివుణ్ణి ప్రదిస్తే చాలు. లేకపోతే ఆ రోజు నువ్వుల దానం చేసిన మంచిదే .

అయితే కార్తీక సోమవారం విశిష్టత తెలిపే ఒక కథ ఉంది. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఎన్నో ఏళ్ళ తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. ఆమె అందగతే కానీ, ఎలాంటి సుగుణాలు లేవు, గయ్యాళి, కామకురాలు. బ్రాహ్మణుడు ఆమెను వయసొచ్చాక ఒక ఉత్తమునికి ఇచ్చి వివాహం చేసాడు. కానీ ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదు. భర్తను హింసించేది. వేరే మగవారితో సాంగ్యాథం చేసేది. అపుడు ఒక పురుషుడు మనకు నీ భర్త అడ్డుగా ఉన్నాడు వాడిని హతమార్చాలని చెప్తాడు. అపుడు ఆమె తన భర్తను నిద్రిస్తుదుండగా హతమారుషుతుంది. తర్వాత ఆమెకు స్వేచ్ఛ దొరికి ఒక వేశ్యగా మరి విలాసవంతంగా బ్రతుకుతుంది.

కాలక్రమేణ ఆమె ముసలిది అయి పుట్టుడు రోగాలతో, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేక మరణిస్తుంది. ఆమె నరకానికి వెళ్లి చాల శిక్షలు అనుభవించి 16 జన్మలు ఒక కుక్కుగా పుడుతుంది. 16 జన్మలో ఒక బ్రాహ్మణుడు ఇంటిలో పుడుతుంది. ఒక కార్తీక సోమవారం రోజున బ్రాహ్మణుడు పూజ చేసిన సాయంత్రం బలి వేసిన అన్నని ఆ కుక్క తింటుంది. అపుడు ఆ కుక్కకి తాను చేసిన పాపాలు గుర్తుకు వచ్చి ఆ బ్రాహ్మణుడుని రక్షించమనగా, అతడు ఒక కార్తీక సోమవారం పూజ ఫలితాన్ని ఆ కుక్కకి దానం చేసి దాని పాపాలన్ని పోగొట్టుతాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *