ఒంట్లో కొవ్వుని కరిగించే వజ్రాయుధం, తక్కువ టైం లో ఎక్కువ బరువు తగ్గుతారు ఇలా చేస్తే

By | March 31, 2022

ఉప్పు అనేది అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతారు అని చాలా పరిశోధనలలో తెలిసింది . ఉప్పు అనేది ఆహారానికి మంచి రుచిని అందిస్తుంది . మన తెలుగు వారు ఉప్పు గురించి ” అన్ని వేసి చూడు నన్నేసి చూడు ” అనే సామెత కూడా వాడుతారు . మనం తీసుకోవాల్సిన ఆహారం కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు అది కొవ్వుగా మారుతుంది , అది వెళ్లి మన నాళాల్లో పేరుకుపోతుంది .

ఇలా కొవ్వు చేరినప్పుడు మన శరీరం లెప్టిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది . ఈ లెప్టిన్ అనే హార్మోన్ వల్ల ఆకలి తక్కువ వేస్తుంది అందువల్ల మనం ఆహారం కావాల్సినంత మాత్రమే తీసుకుంటాం దీనివల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అనేది అదుపులో ఉండి అధిక బరువు పెరగరు . కానీ ఉప్పు అనేది ఎక్కువ తీసుకోవడం ఈ లిఫ్టన్ అనే హార్మోన్ సరిగా పని చేయదు . దీనివల్ల ఆహారాన్ని అధికంగా తీసుకుంటాం .

ఉప్పు అధికంగా వున్న ఆహార పదార్దాలు తీసుకోవడం వల్ల అది మన చిన్నా మరియు పెద్ధ పేగుల్లో పేరుకుపోతుంది . ఉప్పుకు బాక్టీరియా ను నిర్ములించే గుణం కలిగి ఉంటుంది . ఇలా పేగుల్లో పేరుకు పోయిన ఉప్పు అనేది పేగుల్లో వుండే మంచి బాక్టీరియా ని తగ్గిస్తుంది. మన పేగుల్లో వుండే మంచి బాక్టీరియా మన శరీరంలో వుండే గ్లూకోస్ ను తిని మన శరీరంలో అధిక గ్లూకోస్ లేకుండా చేస్తుంది .

పేగుల్లో వుండే మంచి బాక్టీరియా ఇలా గ్లూకోస్ ను తిని రక్తంలో అధిక గ్లూకోస్ లేకుండా చేసి కొవ్వును తగ్గిస్తుంది . కానీ ఉప్పును తినడం వల్ల ఈ బాక్టీరియా మల విసర్జన ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి మన ఆహార పదార్దాలలో ఉప్పుని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *