పిల్లలకు సాయంత్రం స్కూల్ నుండి రాగానే స్నాక్స్ అనే పేరుతో బిస్కెట్స్, నూనెలో దేవినవి, చిప్స్ అని ఇస్తున్నాము. అదే విధంగా ఒక పెద్ద గ్లాస్సెడు పాలు కూడా ఇస్తుంటారు కొంత మంది తల్లులు. పాలు తాగించటం మంచిదే కానీ సాయంత్రము సమయంలో తాగటం వలన అది ఆకలిని చాల వరకు చంపేస్తుంది. ఈ పాలతో పాటుగా ఇంకా టిఫిన్స్ లేదా స్నాక్స్ ఇస్తుంటారు. దాంతో పిల్లల పొట్ట నిండి రాత్రి సరిగ్గా భోజనం చేయరు.
పిల్లలకు చిన్నపటి నుండే వీలైనంత వరకు సహజంగా దొరికే ఆహారాలను అలవాటు చేయాలి. పిల్లలకు తొందరగానే భోజనం కానీ, టిఫిన్ కానీ పెట్టేయాలి. పిల్లలకు సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్, ఇన్స్టంట్ ఫుడ్, నిల్వ చేసినవి ఇవ్వకూడదు. తల్లులు ఇచ్చే ఆహారం పిల్లలకు ఆకలి పెంచే విధంగా ఉండాలి. పిల్లలు ఆకలి అనే వెంట పడేలా ఉండాలి. పిల్లలకు సాయంత్రం 6 నుండి 7.30 మధ్యలో ఆహారం ఇస్తే వాళ్లకు త్వరగా జీర్ణం అవి ఇమ్మ్యూనిటి సిస్టం బాగా పని చేస్తుంది.
పిల్లలకు మొలకిత్తిన గింజలు లేదా ఉడకబెట్టిన దుంపలు, శనగలు, పెసలు ఇలా ఇవ్వండి. సాయంత్రం పాలకు బదులుగా ఒక గ్లాస్ బత్తాయి లేదా ఆరెంజ్ లేదా పైన్ ఆపిల్ జ్యూస్ ఇవ్వండి. దాంట్లో పాలు, చక్కర, ఐస్ కలపకుండా ఇవ్వండి. తీపి తక్కువ ఉంటె 2 స్పూన్స్ తేనె, లేదా యందు ఖర్జురామ్ పొడి వేయండి. మన లాలాజలంలో ఇమ్మునిటి పెంచే కారకాలు ఉంటాయి. ఐస్ వేసినవి తాగటం వలన లాలాజలం రాదు. సాయంత్రం పిల్లలను కాసేపు బయట ఆడుకోనివ్వాలి. ఇలా చేయటం వలన ఫిట్‌గా ఉంటారు. పిల్లలు సాక్స్ లాంటివి లంచ్‌లో ఇవ్వండి. రోజు పండ్, క్యారెట్స్లు తినేలా చుడండి. పడుకునే ముంది పాలు ఇవండీ.