షుగర్ వ్యాధి అనేది శరీరం లో మూడు రకాలుగా ఉంటుంది. అవి టైప్ 1 డయాబెటిస్ , టైప్ 2 డయాబెటిస్ మరియు టైప్ 3 డయాబెటిస్ .
టైప్ 1 డయాబెటిస్ అంటే క్లోమ గ్రంధి లో ఇన్సులిన్ తయారు చేసే బీటా కణజాలం దెబ్బతినడం కాని నశించడం కానీ జరిగితే శరీరం లో ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు .
ఇక పోతే టైప్ 2 డయాబెటిస్ అనేది ఎక్కువగా పెద్దలలో చూడవచ్చు . వీరిలో ఇన్సులిన్ అనేది తయారు అవుతుంది కానీ అది పని చేయదు .
మాములుగా రక్తంలో షుగర్ లెవెల్ అనేది 70 నుండి 90 mg /dL ఉంటుంది . డయాబెటిస్ పేషెంట్ లో 150 కంటే ఎక్కువ ఉంటుంది .
మనం నేరేడు పండు షుగర్ వ్యాధి వున్న వాళ్లకు ఎలా ఉపయోగ పడుతుందో తెలుసుకుందాం.
ఈ నేరేడు పండ్లు రుచికి వగరుగా ఉంటాయి . ఈ నేరేడు పండు అనేది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ముఖ్యంగా రుచి చేదు , వగరు వున్న పండ్లు అనేవి మంచిది అని అంటారు . ఈ నేరేడు పండ్లలో గాలికి ఆసిడ్ అనేది ఉంటుంది దీనివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుతుంది .
జీర్ణాశయ సంబంధ సమస్యలకు కూడా నేరేడు పండు అనేది బాగా ఉపయోగపడుతుంది . నేరేడు పండ్లలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణాశయ పని తీరును బాగా మెరుగు పరుస్తుంది . పేగులలో ఏర్పడే మంటకు మరియు అల్సర్ పుండ్లకు నేరేడు పండు అనేది బాగా పని చేస్తుంది .
నేరేడు పండు రక్త పోటును నియంత్రించడం లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పండులో వుండే అల్లాజిక్ అనే ఆసిడ్ రక్త పోటు హెచ్చుతగ్గులను నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది .
బరువు తగ్గించడం లో కూడా నేరేడు పండు చాలా మంచిది