మనం పచ్చిమిర్చి తో చేసినవి కురాలుగాని, చిరుతిండ్లూకాని తినాలంటే కడుపులో మంట అని తినడం మానేస్తారు. కానీ పచ్చిమిరిచిని కూడా తగిన మోతాదులో, ఎలా తీసుకోవాలో తెలిస్తే అది కూడా మన ఆరోగ్యప్రయోజనాలను చేకూరుస్తుంది. అది ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. పచ్చిమిర్చి బదులు యెర్ర మిర్చిని తీసుకోవద్దు. ఇది అంత ప్రయోజనం చేకూర్చాదు.
రోజు క్రమం తప్పకుండా ఒక పచ్చిమిర్చిని నెల రోజులు తీసుకోవడం వలన కంటి చూపు పెరుగుతుంది. ఎందుకంటె పచ్చిమిర్చిలో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. స్కిన్ గ్లో పెరుగుతుంది. లో బీపీ సమస్య ఉన్నవాళ్లు కూడా రోజు పచ్చిమిరిచి తీసుకోవడం వలన అది తగ్గిపోతుంది. పచ్చిమిర్చిలో విటమిన్ b , నియాసిన్, పొటాషియం, ఫోలేట్, బి ఏ, ఫైబర్, ఐరన్ ఉంటాయి. దేనివల్ల రక్త హీనత, లో బీపీ సమస్య తగ్గుతుంది.
రోజు ఒక పచ్చిమిర్చి తింటే స్టొమక్, ప్రోస్టేట్ కాన్సర్ నుండి కాపాడుకోవచ్చు. ఎందుకంటె యాంటియోక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పచ్చిమిర్చి గుండె జబ్బులకు, జీరక్రియకి, అజీర్తికి, అధిక రక్త స్రావాన్ని ఆపుటకు, ఇన్సులినాన్ని కంట్రోల్ చేస్తూ షుగర్ వ్యాధిని తగ్గుదలకు ఉపయోగపడుతుంది.