మన దేహంలో నరాలు రక్తం సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి. కానీ అదే ఇది నరాలు బలహీనపడితే చాల రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నరాల బలహీనత, నరాల నొప్పులు, నరాల తిమ్మిర్లు వస్తాయి. నరాల బలహీనత ఎక్కువగా షుగర్ వ్యాధి ఉన్న వారిలో, లివర్, కిడ్నీ సమస్య ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. హార్మోన్ లోపల వలన, నరాల బ్లాకేజ్ వలన కూడా అవుతుంది.
ఈ సమస్యలు తగించడానికి ఒక అద్భుతమైన చిట్కా ఒకటి ఉంది. దానికి కావాల్సింది దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క అనేది అధిక బరువు, కొవ్వును మరియు జలుబు, జ్వరం తగిస్తుంది. నరాల పనితీరును, రక్త ప్రవాహాన్ని సరిగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది
మనకు కావలసిన ఇంకొకటి నల్ల పెద్ద యాలకులు. ఇవి హైబీపీని, బ్లడ్ ప్రెసురుని కంట్రోల్లో ఉంచుతాయి . నరాల బ్లాకేజీని క్లియర్ చేస్తాయి. లివర్ వ్యాధులను ఇది తగ్గిస్తుంది. దీనితోపాటు మనకి కావాల్సినవి లవంగాలు. ఇవి వాపును తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచి మలబద్దకం సమస్యని తగ్గిస్తాయి. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తాయి.పావు చెంచా దాల్చిన పొడిని తీసుకొని నీళ్లలో తీసుకొని, రెండు లవంగాలు, ఒక యాలకం తీసుకొని మరిగించి వడబోసి ఉదయం తాగటం వలన నరాల బలహీనత తగ్గుతుంది