మన పురాతన కాలం నుంచి ఉల్లి మీద మంచి సామెత వుంది అది ఏంటి అంటే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని. ఉల్లి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగ పడుతుందో తెలియదు గాని జుట్టు సమస్యకు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది . ఈ మధ్య చాలా మందిలో జుట్టు ఊడిపోవడం తో పాటు జుట్టు పల్చ పడడం , కుదుళ్ళు బలహీన పడిపోవడం , తల దువ్వుతున్నప్పుడే వెంట్రుకలు రాలి పోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి .
ఇలాంటి సమస్యల నుండి బయట పడాలంటే ఉల్లి ని ఎలా వాడాలో తెలుసుకుందాం . ఉల్లి గడ్డలో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు అమ్మోనియా కూడ ఉంటుంది అందుకే మనం ఉల్లి గడ్డను కత్తిరించినప్పుడు మన కంటి నుండి నీరు కారుతుంది . మన వెంట్రుక అనేది కేరాటిన్ అనే ప్రోటీన్. ఈ వెంట్రుకలు అనేవి దృడంగా ఉండాలంటే కెరాటినోసైట్ అనేది ఉత్పత్తి అవ్వాలి ఇది ఉత్పత్తి అవ్వాలంటే ఉల్లిలో వుండే సల్ఫర్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
ఉల్లిపాయని కత్తిరించి బాగా మిక్సీలో గ్రైండ్ చేసి మెత్తటి జ్యూస్ లాగ చేసి మన కుదుళ్లకు బాగా మర్దన చేయాలి . మర్దన చేసిన తర్వాత బాగా ఆరిన తర్వాత తల స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది .