కంటి సమస్యలు చాల రకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా డ్రై నెస్ అంటే కళ్ళు పొడిపడటం, క్యాటరాక్ట్స్, కంటి శుక్లాలు, కళ్ళు మసకబడటం, మాక్యులర్ డిజెనెరేషన్, రేయి చీకటి, గ్లూకోమా, డయాబెటిక్ రెటినోపతి, మయోపియా వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
కంటి సమస్యలు విటమిన్ ఏ లోపం వలనే కాకుండా తక్కువ లైట్లో ఎక్కువగా చదవటం, చూడటం లాంటి వాటి వలన, కనీసం 8 గంటలైనా నిద్ర పోవక పోవటం వలన కనులకు సరియైన విశ్రాంతి లభించక కళ్ళ డ్రైనెస్ రావటం, ఎక్కువగా ఫోన్ స్క్రీన్ చూడటం, తరుచు రంగులు మారె టీవీ స్క్రీన్స్, కంప్యూటర్ స్క్రీన్స్ చూడటం వలన వస్తున్నాయి ఎక్కువగా.
కంటి సమస్యలు మెరుగుపడానికి 8 పోషకాలు అవసరం. విటమిన్ ఏ తీసుకోవటం వలన రంగులను గుర్తిస్తుంది. లుటీన్, జిఓగ్జాంథిన్ రెటీనాను రక్షిస్తాయి. ఇవి ఎక్కువగా మునగాకు, తోటకూరలో ఉంటాయి. ఒమేగా ఫ్యాట్టి 3, 6 ఆసిడ్స్ ఎండలో ఉండే యూవీ రేస్ నుండి కాపాడుతుంది. ఇవి ఎక్కువగా అవిసె గింజలు, వాల్ నట్స్ లో ఉంటాయి. విటమిన్ సి అనేది కంటి ఫ్లూయిడ్కి, కణజాలాన్ని కాపాడుతుంది. విటమిన్ సి అనేది జామకాయ, ఉసిరి, నిమ్మ, బత్తాయిలలో ఉంటుంది. విటమిన్ ఈ అనేది కంటి పొరలు రాకుండా చూస్తుంది. విటమిన్ ఈ అనేది ఎక్కువగ పొద్దు తిరుగుడు, బాదాం పప్పులో ఉంటుంది. జింక్ అనేది చూపును షార్ప్ చేస్తుంది. జింక్ ఎక్కువగా గుమ్మడి గింజలలో ఉంటుంది.