శాకాహారుల్లో బి12 విటమిన్ లోపం అనేది 90% వస్తుంది. మన ప్రేగుల్లో విటమిన్ బి 12 ఖచ్చితంగా తయారవ్వాలి. కానీ ఇపుడున్న కెమికల్ ఫుడ్ వలన, ప్రిజర్వేటివ్స్ వాడిన ఫుడ్ తీసుకోవటం వలన, పురుగుల మందులు వాడిన పళ్ళు, కూరగాయలు వాడటం వలన బి12 విటమిన్ సరిగా లభించక విటమిన్ బి12 లోపం వస్తుంది. మాంసాహారులు తీసుకునే మాంసం వలన బోడీలోకి డైరెక్టుగా విటమిన్ బి12 లభిస్తుంది
ఈ విటమిన్ బి12 లోపం వలన మనకు తెలియకుండానే చాల నష్టాలు జరుగుతాయి. అవేంటంటే బి12 లోపం వలన నరాల పైన ఉన్న మాయాలిన్ షీత్ పలచబడటం లేదా తొలగిపోవటం జరుగుతుంది. ఇలా జరగటం వలన నరాల ప్రసరణ, మెదడుకి సిగ్నలింగ్ దెబ్బ తింటుంది. కండరాల బలహీనత వస్తుంది. చిన్న చిన్న బరువులు కూడా మోయలేకపోతాము. తీవ్రమైన నీరసం, అలసట వస్తుంది.
ఎపుడు మగతగా, మత్తుగా నిద్ర పోవాలి అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలు మరిచిపోవటం, మతిమరుపు రావటం, రక్త హీనత రావటం, మానసిక ఒత్తిడి, జుట్టు ఊడటం, పలచబడటం, కండరాల నొప్పులు, మలబద్దకం, అజీర్తి పెరిగిపోతాయి. విటమిన్ బి12 లోపం రక్త పరీక్ష ద్వారా తెలుస్కోవచ్చు. ఈ లోపాన్ని మందుల వలన లేదా విటమిన్ బి12 పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకుంటే సరిపోతుంది.