కాళ్ళపగుళ్ళు అనేవి చాల విసిగిస్తాయి. పాదాలు కింద ఉంటాయి కాబట్టి వాటికీ అంత జాగ్రత్త తీసుకోము. ఆలా వాటిని వదిలేయటం వలన పగుళ్లుగా మరి నొప్పి పెడుతుంటాయి మరియు చుడానికి అందవిహీనంగా కనపడతాయి. కొందరికైతే ఆ పగుళ్ల నుండి రక్తం, చీము లాంటివి కూడా వస్తుంటాయి. అసలు పేగులు ఎందుకువస్తాయి అంటే అతి వేడి వలన లేదా దుమ్ము దూళి పేరుకుపోయి ఒక గట్టి పెచ్చుల మారుతుంది.
అందుకే మనం మన పాదాలను ఒక అరగంటసేపుఒక చిటికెడు పసుపు వేసుకున్న గోరువెచ్చని నీటిలో ఉంచి తర్వాత ఆ పేగులు మెత్తబడతాయి అపుడు మెత్తని బ్రష్ లేదా గరుకు బట్టతో తుడవండి. కొద్దిసేపటి తర్వాత కొబ్బరినూనె లేదా నెయ్యి రాయండి. బయటికి వెళ్ళటపుడు సిక్స్ వేసుకోండి. ఆ పగుళ్లలో దుమ్ము చేరకుండా ఉంటుంది. ఈవిధంగా చేయటం వలన పాత చర్మం పోయి కొత్త చర్మం వస్తుంది.
ఆడవారితే నీటిలో బాగా కాళ్ళను నానాపుతారు కాబట్టి అపుడే రఫ్ స్కిన్ ని రుద్దేయండి, ఇంకా పాదాలకి అపుడపుడు పసుపు పెట్టండి. ఇలా చేయటం వలన పసుపులో ఆంటిసెప్టిక్ గుణాల వలన పగుళ్ల నుండి రక్తం రావడం తగ్గుతుంది. పడుకునేటపుడు పగుళ్ల దగ్గర నూనె లేదా నేయి రాసి పడుకోండి. పాదాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. మట్టిలో తిరిగినపుడు పగుళ్లు ఉన్నవారు చెప్పులు లేదా సిక్స్ వేసుకోండి. ఇలా వారం లేదా పది రోజులు చేస్తే పగుళ్లు తగ్గుతాయి.