ఈ విధంగా చేస్తే మీ జుట్టు రాలడం ఆగిపోయి, బాగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది

By | November 9, 2021

మనలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో మరియు బట్ట తల సమస్యతో బాధపడుతుంటారు . ముఖ్యంగా జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు కాలుష్యం , ఆహారపు అలవాట్లు , హార్మోన్ల హెచ్చు తగ్గుల అనేవి ప్రధాన కారణాలు. ఇలాంటి సమస్యకు మన ఇంట్లో ఉండే కొన్ని పదార్దాలతో ఇలా చేస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది . అందుకు మనకు ముక్యంగా కావాల్సినవి తమల పాకు , కరివేపాకు , కొబ్బరి నూనె.

తమల పాకు ను మనం పూజ వేడుకలలో కూడా వాడతారు . కొంత మంది పాన్ రూపంలో కూడా తింటారు ఇలా పాన్ లో తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి .

అయితే ఈ తమల పాకులను చర్మ సౌందర్యానికి , జుట్టు పెరగడానికి కూడా వాడవచ్చని చాల తక్కువ మందికి తెలుసు. తమల పాకులో విటమిన్ C అనేది పుష్కలంగా లభిస్తుంది .

ఆయుర్వేదంలో తమల పాకులను జుట్టు రాలే సమస్యకు వాడతారు . తమలపాకులను కొన్ని తీసుకొని నువ్వులనూనె తో కలిపి మిక్సీ లో వేసి బాగా పేస్ట్ లాగ చేసి దాన్ని మీ తల పైన బాగా ఒక మాస్క్ లాగ వేసుకోవాలి . ఇలా చేసిన పావు గంట తర్వాత స్నానము చేస్తే మీ జుట్టుకు చాలా ప్రయోజనాయాలు కలుగుతాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *