ఈ 6 రకాల పదార్దాలు తింటే ఎంత బక్కగా వున్న మీ కండ స్పీడ్ గా పెరుగుతుంది

By | November 6, 2021

చాలా మంది రక రకాల కారణాల వల్ల బరువు తగ్గిపోతూ ఉంటారు . బక్కగా వున్న వారికి మెడ మీద ఎముకలు పొడుచుకొని కనపడతాయి ఇంకా ప్రక్కటెముకలు , మోచేతి దగ్గర ఎముకలు బయటికి వచ్చి కనపడతాయి . ఇలా కనపడటం వల్ల మన గురించి పక్క వారు రకరకాలుగా చర్చింకుంటారు . కండ పుష్టి ఎక్కువగా లేకపోతే చర్మం కాస్త ముడుచుకొని ముసలితనం కూడా తొందరగా వచ్చినట్టు కనపడుతుంది. మరి మనం కొన్ని రకాల ఆహార పదార్దాలు తిని కండ పుష్టి ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.

పచ్చి కొబ్బరి అనేది కండ పుష్టికి చాలా మంచిది . చాలా మందిలో కొబ్బరి తింటే కొలెస్ట్రాలు పెరుగుతుంది అనే అపోహ వుంది కానీ కొబ్బరిలో కొలెస్ట్రాలు అనేది సున్నా . మనం ఎక్కువగా పచ్చి కొబ్బరి అనేది దేవుడి ప్రసాదంగా తింటాము కానీ కుదిరినప్పుడల్లా ఒక అర పచ్చి కొబ్బరి తినడం చాలా ముఖ్యం. పచ్చి కొబ్బరి తినడం వల్ల మంచి కొలెస్ట్రాలు పెరిగి చెడు కొలెస్ట్రాలు తగ్గుతుంది.

కండ పుష్టి పెరగడానికి మరొక ఆహారం వేరు శనగ పప్పు . వీటిని పేద వాడి జీడి పప్పు గా పిలుస్తారు . మేక , కోడి మాంసం కంటే కూడా ఎక్కువ మాంస కృతులు , పోషకాలు ఉంటాయి. వేరు శనగలు పచ్చివి కాకుండా రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్నే తింటే మంచి బలమైన కండ పుష్టి లభిస్తుంది.

ఇంకా పుచ్చకాయ గింజలు కూడ శరీర కండ పుష్టికి చాలా మేలు చేస్తాయి . వీటి ధర కూడ చాల తక్కువుగా ఉంటుంది. ఇవి అన్ని కిరాణా షాప్ లో దొరుకుతాయి . వీటిలో 33% ప్రోటీన్స్ ఉంటాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *