మనం తరుచు భోజనంలో కూరలతోపాటుగా రసం కూడా వాడతారు. ఐతే రసం అంతే చింతపండు రసం తీసి దానికి ఎక్కువ మోతాదులో నీళ్లు ఉప్పు, కారం,మిరియాలు, కొత్తిమీర మిగతా వాటిని కలిపి అన్నంతోపాటుగా తింటాం. ఇలా ఎక్కువగా నీళ్లలా ఉన్న చింతపండు రసం తాగటం వలన పొట్టలో జీర్ణక్రియకు ఉపయోగపడే జీర్ణ రసాలు అని కరిగిపోయి తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాదు.. అందుకే చాల మంది పులుపు తింటే అన్నం అరగట్లే అంటారు.
దాని బదులుగా టమాటో రసం అంటే టొమాటోలను ఉడికించి తీసిన రసం అన్నతో పాటుగా లేదా భోజనం కంటే అరగంట ముందు తీసుకుంటే జీర్ణ క్రియ పెరుగుతుంది.
టొమాటో రసం వలన ఉపయోగాలు:
- జీర్ణక్రియ క్రియ రేటు మరియు ఆకలిని పెంచుతుంది.
- చలికాలంలో ఈ రాసాని మిరియాలతో పాటుగా తీసుకుంటే కఫం, శ్లేష్మం తగ్గుతుంది.
- టొమాటోలోని ఆంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
- టమాటో రసం కాన్సర్ ముప్పు నుండి కాపాడుతుంది.
- గుండె సంబంధ వ్యాధులు ఈ రసం తీసుకోవటం చాల వరకు నివారించవచ్చు.