మన పెద్దలు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు అందులో ఎంతో కొంత నిజం ఉంది కానీ మనం కొన్ని సందర్భాలలో ఉల్లిని మానివేయాలనుకుంటాం… కొంతమంది ఆధ్యాత్మిక చింతనలో జీవనం సాగించేవారు మరియు ఇంద్రియ నిగ్రహం పాటించేవారు ఈ ఉల్లి రుచిని ఆస్వాదించలేనివారు దానికి బదులుగా క్యాబేజీని కానీ, క్యాలీఫ్లవర్ కాడలను కూడా వాడవచ్చు.
ఉల్లిముక్కలు బదులుగా మనం వంటకాలలో ఈ క్యాబేజి ముక్కలను సన్నగా తరిగి వాడవచ్చు… దీనివల్ల కూరల యొక్క రుచి కూడా చాలా బాగుంటుంది . క్యాబేజీ లో విటమిన్ A , ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి . వీటితో పాటు B6 అనే విటమిన్ కూడా ఉంటుంది . ఇది మన జీవ క్రియకు , నాడీ వ్యవస్థ కు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి .
క్యాబేజీ లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి . క్యాబేజీ ను ఎక్కువుగా తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ కూడా చాల ఆరోగ్యంగా ఉంటుంది