పెరుగు మరియు పుల్లటి మజ్జిగ వల్ల ఎన్ని అదిరిపోయే లాభాలో తెలుసుకోండి

By | December 23, 2021

పెరుగు ను మనం అన్నంతో గాని లేదా మజ్జిగ రూపంలో గాని తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి . పెరుగు లో ఫాస్పరస్ మరియు క్యాల్షియం వల్ల దంతాలు మరియు ఎముకలు దృడంగా అవుతాయి . పెరుగులో మన శరీరానికి మేలు చేసే లైవ్ సూక్ష్మ జీవులు ఉంటాయి . ఈ సూక్ష్మ జీవులు తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేసి రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.

చాలా మందివంటల్లో పాలు పోసి గాని పెరుగు పోసి వండుకోవడం కానీ పూర్వం రోజుల నుంచి వస్తున్న ఒక అలవాటు . మనం వంటల్లో పుల్లటి పెరుగు లేదా పుల్లటి మజ్జిగ గాని వేసి వండుకుంటే కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. వంటల్లో ఉప్పు, నూనె తక్కువ మోతాదులో వేసుకొని వండుకొంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి .

పుల్లటి పెరుగు వంటల్లో వేయడం వల్ల చప్పదనం అనేది పోయి ఉప్పదనం అనేది వస్తుంది అందువల్ల కూరల్లో ఉప్పు లేని లోటు తెలియదు . దీనివల్ల మన వంటలు ఉప్పు వేయకుండానే వండుకోవచ్చు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *