రక్తం అనేది మగ వారిలో 5 లీటర్లు , ఆడ వారిలో 4.5 లీటర్లు ఉంటుంది . రక్తం అనేది పల్చగా ఉంటే రక్త నాళాల్లో దాని ప్రవాహం కూడా సులువుగా ఉంటుంది . రక్తం అనేది గడ్డ కట్టినా , కాస్త మందంగా అయినా రక్త నాళాల్లో దాని ప్రవాహం నెమ్మదిగా జరిగి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం వుంది .
రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె పోటుతో పాటు పక్షవాతం కూడా వచ్చే అవకాశాలు పెరుగుతాయి . అందుకని మన ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . రక్తం చిక్క పడడానికి ఉప్పు కూడా ప్రధాన కారణం . వంటల్లో ఉప్పు అనేది ఎంత తక్కువ గా వేస్తె అంత మంచిది .
ప్రతి రోజు ఉదయం పూట నడకను అలవాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . అంతే కాకుండా కాస్త గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మ రసం , తేనె కలిపి తాగితే శరీరంలో వున్న కొలెస్టాలు అనేది తగ్గుతుంది .