కొంత మందికి కొద్దీ దూరం నడిచిన సరే బాగా ఆయాస పడి అలిసిపోతారు అంతే కాకుండా కొంత మందికి కాళ్ళు , చేతులు వణికి పోతాయి . ఇలాంటి సమస్యలకు ముఖ్యమైన కారణం నరాల బలహీనత . మన ఉరుకుల , పరుగుల జీవితంలో మన ఆహార అలవాట్ల పైన శ్రద్ధ తీసుకొనే టైం కూడా దొరకడం లేదు . అయితే మనం మన ఇంట్లో దొరికే కొన్ని ఆయుర్వేద పదార్దాలను ఉపయోగించి తిరిగి మన నరాల్లో బలాన్ని నింపవచ్చు .
ముందుగా మనకు కావాల్సినవి మిరియాలు . మన ఆహారంలో రుచిని పెంచడానికి ఉపయోగించే మిరియాలే మన నరాల బలహీనతకు దివ్య ఔషదంగా పని చేస్తుంది . సుగంధ ద్రవ్యాల్లో మిరియాల కు ఎంతో ప్రాముఖ్యత వుంది . వీటిని మనం రోజు ఆహారంలో భాగంగా చేసుకొంటే ఎన్నో అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు . ముఖ్యంగా ఇందులో వుండే పోషకాలు, యాంటీ బాక్టీరియా , యాంటీ ఇంఫ్లఅమేటరీ గుణాల వల్ల నరాల నొప్పి , నరాల బలహీనత తగ్గుతుంది .
ఇంకా మన నరాల బలహీనతకు వాల్నట్ (walnut ) కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది . వాల్నట్ అనేది చూడడానికి మెదడు ఆకారంలో ఉంటుంది . వాల్నట్ తినడం వల్ల మెదడు చాలా చురుకుగా పని చేస్తుంది. మన నరాల పుట్టుక అనేది మన మెదడులోనే జరుగుతుంది. ఇందులో వుండే ఒమేగా 3 ఫాటీ ఆసిడ్ వల్ల మన మెదడులోని కణాలను చురుకుగా పని చేసేలా చేసి నరాల మధ్య సమాచారం వేగంగా జరిగే లాగా చూస్తాయి.