మనం తల స్నానం చేసేటప్పుడు షాంపూ వాడడం వల్ల అందులో ఉన్న రసాయనాల కారణంగా జుట్టు అనేది పొడిబారడం , కొంత మందిలో జుట్టు రాలి పోవడం జరుగుతుంది. షాంపూ ఉపయోగిస్తూ కూడా మన జుట్టును కొన్ని ఆయుర్వేదాలను వాడి సరి చేసుకోవచ్చు. జుట్టుకు మందార అనేది చాలా మేలు చేస్తుంది . మందార పువ్వును మరియు ఆకును కూడ వాడవచ్చు . మందార అనేది మన దేశంలో చాలా మంది తమ పెరటి మొక్కగా పెంచుతారు . మందార పూలను పూజలో కూడ వాడుతారు .
ఆయుర్వేదంలో జుట్టు పెరుగుదలకు మందార అనేది ప్రసిద్ధమైన మూలిక . జుట్టు రాలే సమస్యతో బాధపడేవారికి మందార ఆకులు , మందార పువ్వులు మంచి నివారణగా పని చేస్తాయి . మందార పువ్వులను బాగా పేస్ట్ లాగ చేసి జుట్టు బాగా పట్టించి కొద్దిగా ఆరిన తర్వాత తల స్నానం చేస్తే కుదుళ్ళు బాగా బలంగా అవుతాయి .
మందార పువ్వులలో సహజంగా వుండే అమైనో అమ్లాలు జుట్టు పెరుగుదలకు సహాయపడే పోషకాలను జుట్టుకు అందిస్తాయి .
చుండ్రు ఎక్కువగా వున్న వారిలో తల పైన చాలా దురదగా ఉంటుంది . అలాంటి వారికి మందార అనేది మంచి ఆస్ట్రిజెంట్ లాగ పని చేస్తుంది . జుట్టుకు మందార ఆకులను వాడడం వల్ల జుట్టు యొక్క pH బాలన్స్ చేస్తుంది .