మనం వంటల్లో తాలింపు అనేది వేస్తాం కానీ ఈ తాలింపు అనేది వెల్లుల్లి లేకుండా చాలా మంది చేయరు. తాలింపులోకి వెల్లుల్లి అనేది అంత ముఖ్యమైన పదార్థం . ఈ వెల్లుల్లి ని వంటలో ఎందుకు తప్పనిసరిగా వాడతారు అంటే వెల్లుల్లి అనేది మన రక్తానికి ఎంతో మేలు చేస్తుంది . వెల్లుల్లి అనేది రక్తంలో వుండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో ఎంతో బాగా సహాయపడుతుంది .
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించాలంటే మంచి కొలెస్ట్రాల్ అనేది కూడ ఉండాలి . వెల్లుల్లి లో వుండే అల్ఫా లినొలెనిక్ అనే ఆసిడ్ మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అందుకే వెల్లుల్లి ని యాంటీ కొలస్ట్రాల్ పదార్థంగా పిలుస్తారు.
అయితే చాలా మంది వెల్లుల్లి ని వంటలో వాడేటప్పుడు ఒక తప్పు చేస్తారు అది ఏంటి అంటే నూనె బాగా వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ని అందులో వేస్తారు . ఆ వేడెక్కిన నూనె యొక్క ఉష్ణోగ్రత అనేది దాదాపు 200 డిగ్రీల వరకు ఉంటుంది . ఇంత వేడి వల్ల వెల్లుల్లి లో వుండే ఔషధ గుణాలతో పాటు అందులో వుండే కొవ్వు పదార్దాలు కూడా మాయం అయి పోతాయి . అందువల్ల ఈ వెల్లుల్లి ని చివర వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.