విటమిన్ B కాంప్లెక్స్ ఎక్కువగా దొరికే గింజ . నరాల బలహీనత తగ్గడం తో పాటు ఫోలిక్ యాసిడ్ అనంతం..

By | July 20, 2021

మన శరీరానికి B కాంప్లెక్స్ అనే విటమిన్ ఎంతో అవసరం . ఇది మన శారీరక బలానికి , నరాలు సరిగా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది . మనం రోజు వారి ఆహారంలో గనుక బి విటమిన్ తీసుకోకపోతే శరీరం అలసట గా అనిపించడం , కాళ్ళ పిక్కలు లాగినట్లు అనిపిస్తాయి . బాగా పాలిష్ పట్టిన ఆహారాన్ని తినడం వల్ల మరియు వేడి చేసి ఉడకబెట్టిన వడ కాచిన ఆహారం ద్వారా ఈ విటమిన్ ను కోల్పోతాము .

ఈ B కాంప్లెక్స్ విటమిన్ లో అనేక రకాలైన గ్రూప్ లు ఉన్నాయి. అందులో మనకు బాగా ముఖ్యమైనది B9. దీనిని ఫోలిక్ ఆసిడ్ అనికూడా పిలుస్తారు . మరి ఈ ఫోలిక్ ఆసిడ్ అనేది మన శరీరంలో కొత్త కణాలు ఏర్పడడానికి చాలా బాగా సహాయ పడుతుంది . అందుకే గర్భిణీ స్త్రీలు దీనిని టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటారు .

మన శరీరంలో రోజుకు కొన్ని కోట్ల కణాలు నశిస్తాయి అందుకని ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనకు ఎంతో అవసరం. ఈ ఫోలిక్ ఆసిడ్ అనేది ఎక్కువగా వుండే గింజ రాజ్మ గింజ. ఫోలిక్ ఆసిడ్ అనేది పెసలు , శనగలలో కూడా ఉంటుంది కానీ 100 గ్రా . గింజల్లో 180మైక్రో గ్రాములు ఉంటుంది .
అదే 100 గ్రా . ల రాజ్మ గింజల్లో 365 మైక్రో గ్రాములు ఉంటుంది. ప్రోటీన్ మరియు మాంస కృతులు కూడా చాలా ఉంటాయి. రాజ్మ గింజలను కూర లాగ వండుకొని తినవచ్చు. అంతే కాకుండా మనం తినే ఆకూ కూరల్లో కూడా వేసికొని తినవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *