మనం అంజీర ను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది . మనం ఈ అంజీర ను పచ్చిగా గాని నీళ్లలో నానబెట్టి గాని తినవచ్చు. మనం పడుకునే ముందు ఒక కప్ లో కొన్నినీళ్లు పోసి అందులో నానబెట్టి పొద్దున్నే తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి .
వేసవి కాలం లో వీటిని నానబెట్టి తింటే చాల మంచిది . అదే మరి చలి కాలం , వర్షా కాలం లో అయితే డైరెక్టుగా కూడా తినవచ్చు కాకపోతే వీటిని నానబెట్టి తింటే మరీ మంచిది .
మానవ శరీరంలో ఎముకల ఆరోగ్య అనేది చాలా అవసరం. ఎముకులు దృడంగా లేకపోతే మనం కాస్త జారీ పడిపోయిన సరే ఎముకలు విరిగే అవకాశం ఉంటుంది . ఎముకలు దృడంగా ఉండాలంటే వాటికీ కాల్షియం అనేది ఎంతో అవసరం . అంజీరలో వుండే సహజ సిద్దమైన కాల్షియం వల్ల ఎముకలతో పాటు దంతాలు కూడా మంచి బలంగా మారుతాయి .
గర్భిణీలకు కూడా అంజీరలు ఎంతో మేలు చేస్తాయి . అంజీర వుండే అధిక పోషకాల వల్ల డాక్టర్లు కూడా తినమని చెప్తారు . అంజీరలో వుండే విటమిన్ B అనేది గర్భిణీ స్త్రీలలో కలిగే ఉదయపు నీరసాన్ని తగ్గిస్తుంది .
అంజీర పళ్లలో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల జీర్ణం సరిగా అయి మల బద్దక సమస్యను కూడా తగ్గిస్తుంది .