తిప్పతీగ శాస్ర్తియ నామం టీనోస్పోరా కార్డిపోలియో అని హిందీలో గుడిచి అని పిలుస్తారు. తిప్పతీగలో దాని కాండంన్ని మంచి పోషక నిలయంగా చెప్పవచ్చు ఎందుకంటే అందులో ఎక్కువ పోషకాలు మరియు అల్కా లాయిడ్లు ఎక్కవుగా ఉంటాయి. ఈ తిప్పతీగ అనేది కాస్త చేదు రుచిని కలిగి ఉంటుంది . దీనిని అనేక రకాలైన శరీర రుగ్మత లకు వాడుతారు. వాత మరియు కఫ దోషాలను నివారించడం లో బాగా ఉపయోగ పడుతుంది . తిప్పతీగ యొక్క ఆకు అనేది హృదయ ఆకారంలో వుండి ఎరుపు రంగు పండ్లను కలిగి ఉంటుంది .
తిప్పతీగ లో శరీర రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే 37 రకాల పదార్దాలు వున్నాయి . వీటివల్ల శరీరం లోకి ఏదైనా హానికర క్రిములు చేరినప్పుడు వెంటనే రోగ నిరోధక వ్యవస్థ అప్రమత్తం అవుతుంది . తిప్పతీగ అనేది తెల్ల రక్త కణాల ఉత్పత్తి కి బాగా సహాయ పడుతుంది.
తిప్పతీగ ను అనేక రకాలుగా వాడవచ్చు. ముక్యంగా గ్రామీణ ప్రాంతాల్లలో చాలా విరివిగా దొరుకుతుంది. తిప్పతీగ ఆకులను తెచ్చుకొని ముందుగా మంచి నీళ్లతో శుభ్రంగా కడుక్కొని దాన్ని మెత్తగా దంచి రసం లాగ కాని ముద్దలాగా కానీ చేసుకొని మింగాలి .
ఒకవేళ ఈ ఆకు దొరకని వాళ్ళు పొడిని కూడా వాడవచ్చు . మార్కెట్లో పొడి రూపంలో దొరుకుతుంది . ఈ పొడిని నీటిలో వేసి బాగా మరిగించి తాగవచ్చు.