కాల క్రమేణ మన ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వున్నాయి. చాలా తక్కువ మంది మాత్రమే మంచి ఆహార అలవాట్లను కలిగివున్నారు . చాలా మంది ఈ రోజుల్లో బయట దొరికే చిరు తిండ్లకు బాగా అలవాటు పడిపోయారు వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి .
ఈ రోజుల్లో ఎముకలకు సంభందించిన సమస్యలతో చాల మంది బాధపడుతున్నారు . శరీరంలో కాల్షియం లోపం వల్ల కాళ్ళు లాగుతున్నట్లు ఉండడం , నడుస్తున్నపుడు తిమ్మిర్లు రావడం , పిక్కల్లో నొప్పి ఇంకా అనేక రకాల సమస్యలు వస్తాయి అని నిపుణులు చెప్తారు.
ఈ విధంగా లడ్డులు చేసుకొని తినడం వల్ల మంచి ఆరోగ్య ఫలితాలు వస్తాయి . ఈ లడ్డు తయారీలో వాడిన బెల్లం , బాదం , నువ్వులు, అవిసె గింజలు , కిస్మిస్ , నెయ్యి అనేవి ఆరోగ్యాన్ని చాలా మంచి చేస్తాయి . ఇవి తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి వీటిని ఏ వయసు వారు అయినా తినవచ్చు . కాకపోతే లడ్డులో వాడిన నువ్వుల వల్ల కాస్త శరీరం వేడి చేస్తుంది కాబట్టి వీటిని రోజుకు ఒకటి లేదా రెండు కన్నా ఎక్కువ తీసుకోకుంటే మంచిది .
బాదం లో విటమిన్ E అధికంగా ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల శరీర కాంతి కూడా బాగా పెరుగుతుంది . బాదం వల్ల కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది.
అవిసె గింజల్లో వుండే కాల్షియం వల్ల ఎముకలు దృడంగా అవుతాయి . అంతే కాకుండా మోకాళ్ళ నొప్పి , కీళ్ల నొప్పి లు కూడా తగ్గుతాయి .