ఈ పొడి పిల్లలకు , పెద్దలకు అన్ని రకాల విటమిన్స్ లోపాన్ని తగ్గించి మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ..

By | June 18, 2021

ఈ మధ్య కాలంలో వచ్చిన వై రెస్ భారిన పడ్డవారు దాని నుండి కోలుకున్న తరవాత కూడ దాని వల్ల వచ్చే కొన్ని అనర్దాల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ముక్యంగా ఎక్కువ సేపు పని చేయక పోవడం, దూరం నడవ లేక పోవడం లాంటి సమస్య లతో భాదపడుతున్నారు . అంతే కాకుండా అలసట గా , నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి వాటితో బాధపడేవారు ఆహార నియమాలలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది .

ఈ ఆహార పదార్దాలను వాడడం వల్ల నీరసం , అలసట తగ్గడం తో పాటు మీ రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది . వీటిలో ముందుగా మనం ఫుల్ మఖానీ గురించి తెలుసుకుందాం. వీటిని తెలుగు లో తామర గింజలు అని కూడా అంటారు . ఇవి మీ మూత్ర పిండాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడం తో పాటు షుగర్ తో బాధపడే వారి శరీరం లో ఇన్సులిన్ మోతాదును క్రమ బద్దీకరిస్తుంది .

ఈ తామర గింజలలో క్యాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల మీ కీళ్లు మోకాళ్ళ నొప్పులను కూడా మాయం చేస్తుంది. అంతే కాకుండా వీటికి ఉన్న అంటి ఏజింగ్ గుణం వల్ల శరీర ముడుతలు కూడ తొందరగా రావు .

వీటితో పాటు మనం తీసుకోల్సిన మరొక పదార్థం బాదం గింజలు . వీటిలో ఫాస్ఫరస్ , విటమిన్ E , ఫైబర్ , ప్రోటీన్ అనేవి వీటిలో సమృద్ధిగా ఉంటాయి . వీటిని అనేక రోగాలతో భాద పడేవారు తీసుకోవడం వల్ల మంచి ఫలితం తో పాటు మీ రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది . ముఖ్యం గ మతి మరుపు సమస్యతో .భాద పడేవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది . బాదం గింజలను రాత్రి పాడుకొనే ముందు నీటిలో నాన బెట్టి పొద్దున్నే తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది .

ఇక ఇప్పుడు మనం ఇంకొక దాని గురించి తెలుసుకుందాం అది ఏమిటి అంటే నువ్వులు . నువ్వులను పోషకాల పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు . ఈ నువ్వుల వుండే విటమిన్స్ వల్ల అలసట, నీరసం తో పటు డిప్రెషన్ ను కూడ దూరం చేస్తాయి . వీటితో పాటు సోంపు గింజలను కూడ మీ ఆహారం లో భాగం చేసుకోండి . సోంపు గింజల వల్ల జీర్ణశక్తి పెరగడం తో పాటు గ్యాస్ , అసిడిటీ లాంటి సమస్యలను దూరం చేస్తుంది . సోంపు గింజలు అనేవి మీ కంటి చూపును మెరుగు పరచడం లో చాలా బాగా ఉపయోగపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *