మనం తియ్యని పదార్దాలు చేసుకోవాలంటే అందులో తియ్యదనం కోసం చాలామంది చక్కర కలుపుతారు. చక్కర ను తయారు చేసేటప్పుడు దానిలో అనేక రసాయ నాలు కలపాల్సివస్తుంది . నల్లగా వుండే చెరుకు రసం నుండి తెల్లటి చక్కర వస్తుంది అంటే అందులో ఏ మోతాదులో కలుపుతారో అర్ధం చేసుకోవచ్చు. ఈ తియ్యటి పదార్దాలు కలిపిన ఐస్ క్రీమ్స్ , స్వీట్స్ తినడం వల్ల కొంతమంది పిల్లల్లో గొంతుల్లో మంట , జలుబు లాంటివి వస్తాయి.
మరి ఇలాంటి సమస్యల నుంచి బయటపడి మరియు మీరు తీపిని తినాలంటే ఎం చేయాలో తెలుసుకుందాం
ఆహార పదార్దాలలో తీపిదనం కోసం తేనె ను కలుపుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి . ప్రాచీన కలం నుంచి కూడా తేనె ను ఒక ఆయుర్వేదం మందు గా ఉపయోగిస్తారు. ఈ తేనెలో యాంటియోక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి . తేనె ఉపయోగించడం వల్ల ఊపిరితిత్తుల్లో కఫం ఏర్పడదు . తేనెను గాయాలు వున్నా చోట కూడా వాడవచ్చు దీని వాళ్ళ చర్మం మునుపటి లాగ మాములుగా అవుతుంది. అంతే కాకుండా తేనె తో చేసిన ఆహార పదార్దాలు తినడం వల్ల జీర్ణ సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
తీపి కోసం తేనె అందుబాటులో లేకపోతే ఎండు ఖర్జురాను కూడా వాడవచ్చు . ఎండు ఖర్జురాను బాగా ఎండబెట్టి అందులో ఉన్న గింజలు తీసివేసి మిక్సీలో వేసి మెత్తటి పొడిగా చేసుకోండి. ఈ పొడిని పాలల్లో గాని , మజ్జిగ లో గాని కలిపి తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.