మనం పల్లెప్రాంతాలకు వెళ్ళినపుడు పొలాల పక్కన లేదా రోడ్ల పక్కన కనిపించే గోలి అంత సైజు ఉన్న గుండ్రని కాయలున్న చెట్టును విరిగి లేదా నక్కెర లేదా బంక చెట్టు అంటారు. ఈ చెట్టు పండ్లు లోపల చూస్తే బంకగా అనిపిస్తాయి. పిల్లలు, పెద్దలు చాల మంది తింటారు. పండిన పండ్లు రుచికి తినడానికి తియ్యగా ఉంటాయి. కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఈ చెట్టు ఆకులూ, బెరడు, కాయలు ఆయుర్వేదంలో విరివిగా వాడతారు. ఈ చెట్టు పండ్లు అంటి ఇంఫ్లమ్మెటరీ లక్షణాలు కలిగి ఉంటాయి.
నక్కెర పండ్లు అనేవి రక్తములోని దోషాలను నివారిస్తాయి. వీర్య వృద్ధిని పెంచి సంతానం సాఫల్యం పెంచుతాయి . అజీర్తి సమస్య ఉన్నవారు ఈ పండ్లు 5-6 తింటే, తిన్న ఆహారం అరుగుదల పెరుగుతుంది. ఈ చెట్టు బెరడు రసమును పుండ్లపైన పూసిన అవి త్వరగా మానతాయి మరియు చర్మ సమస్యలను నివారిస్తుంది. విరిగి చెట్టు బెరడు కషాయం జరం తగ్గించడానికి ఉపయోగించేవారు.
విరిగి చెట్టు పచ్చి కాయలను పచ్చడి చేసుకొని తింటారు . ఈ కాయలలో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఇవి మన దేహానికి కావలసిన బలాన్ని చేకూరుస్తాయి. ఈ చెట్టు ఆకులను ముద్దగా నూరి నుదురుకి పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది . ఈ చెట్టు బెరడు కషాయంను నోట్లో వేసుకుని పుక్కిలిస్తే దంత సమస్యలు, నోటి పూత, నోటి దుర్వాసన వంటి సమస్యలు తగ్గిపోతాయి.