యువతలో ఎక్కువగా ఒక వయస్సు వచ్చే సరికి మొఖంపైన మొటిమలు ఏర్పడతాయి. దానికోసం రాకరాక క్రేములు వాడిన అవి తాత్కాలిక మార్పును మాత్రమే తెస్తాయి లేదా ఇతర హానికర దుశ్శఫలితాలను చూపుతాయి. ఇలా కాకుండా సహజసిద్ధంగా ఎలా మొటిమలు రాకుండా ఉండడానికి కొన్ని సూచనలు తెలుసుందాం. మొదటగా మొటిమలు రాగానే వాటిని గిల్లవద్దు ఆలా చేస్తే అక్కడ మచ్చ, చిన్న రంద్రం ఏర్పడుతుంది. కావున దానంతట అదే పగిలెవరకు చూడాలి.
ఇంకొకటి మోకానికి మంచి తేనె తీసుకుని బాగా మొటిమలు ఉన్న చోట మర్దన చేసి తర్వాత పసుపునీటితో ఆవిరి బాగా చెమటలు వచ్చే వరకు పట్టాలి. దాని తర్వాత మొకం కడిగి మంచి నల్ల మట్టిని తీసుకొని సన్నని పొడిగా జల్లెడ పట్టి పేస్ ప్యాక్ ల వేసి ఆరిన తర్వాత కడిగివేయాలి. రోజుకు నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. 30-40% పళ్ళ రసాలు, వెజిటల్ సలాడ్ తీసుకోవాలి. రోజుకు కాస్త వ్యాయామం చేస్తూ మోషన్ కూడా ఉదయం, సాయంత్రం వెళ్ళాలి.
ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఎక్కువగా విటమిన్ ఏ విటమిన్ సి ఉన్న పళ్ళ రసాలు లేదా కీరా, బీట్రూట్ లేదా కార్రోట్ , టమాటో జ్యూస్ ఉదయం లేదా సాయంత్రం తీసుకోవటం వలన వంట్లో యాంటియోక్సిడెంట్స్ పెరిగి మొటిమలు రాకుండా, ఉన్న మొటిమలు, వాటి మచ్చలను త్వరగా తొలగిస్తుంది. పండ్లు, డ్రై ఫ్రూప్ట్స్ ఎక్కువగా తినండి. జంక్ ఫుడ్ తీసుకోకండి.