మనం అదేపనిగా కూర్చున్నపుడు కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి. పడుకున్నప్పుడు చేతులపైనా పడుకుంటే అవి తిమ్మిర్లు వస్తాయి. కొద్దిసేపు తిమ్మిర్లు వచ్చిన కొద్దీ సమయం తర్వాత మాములు స్థితికి వస్తాయి. ఇలా తిమ్మిర్లు రావడానికి గల కారణం మనలో రక్త ప్రసరణ సరిగ్గా లేదని అర్ధం. ఇలా ఎక్కువగా మద్యపానం సేవించే వారిలో, మధుమేహం ఉన్నవారిలో ఎక్కువగా వస్తుంది. అయితే రక్ప్రసరణ సరిగ్గా జరగకపోవటానికి కారణం విటమిన్ బి 12 లోపం.
విటమిన్ బి 12 నరాల పనితనానికి, మెదడులో నరాల వ్యవస్థని, ముఖ్యంగా యెర్ర రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ యెర్ర రక్తకణాల ఉత్పత్తి సరిగ్గా లేకుంటే ఆక్సిజన్ అనేది అన్ని అవయవాలకు అందాకా చెడిపోవడానికి కారణం అగును. ఈ విటమిన్ బి 12 అనేది ఎక్కువగా పాలు, చేపలు, పెరుగు, పన్నీర్, మాంసంలో ఉంటుంది. ఇలా తిమ్మెరర్లు వచ్చిన వారు ఇరవై రోజుల పాటు ఆపిల్ వెనిగర్ సైడర్ ను ఉదయం సాయంత్రం 2 స్పూన్స్ తీసుకోండి.
కాల్షియమ్ లోపం వలన కూడా నరాల తిమ్మిర్లు వస్తాయి. అందుకే మీరు కాల్షియమ్ ఎక్కువగా పాలు, అంజీర పండ్లను రోజు రెండు తీసుకోండి. ఇలా చేస్తే రక్తం కూడా పెరుగుతుంది. నువ్వలలో కూడా కాల్షియమ్ ఎక్కువగా ఉంటుంది. ఇలా నువ్వులను తీసుకోవటం వలన డయాబెటిస్ ను కంట్రోల్ చేయవచ్చు. ఆకుకూరల్లో బ్రోకలీ, క్యాలిఫ్లవర్లో విటమిన్ కే ఉంటుంది. ఇది కూడా ఎముకలకు, నరాల బలానికి ఉపయోగపడతాయి.