కర్పూరం అనేది ప్రతి ఒక్క పూజలో వాడుతుంటారు. మనం దేవుడిని కండ్ల నిండుగా చూడడానికి పూజ చేసిన ప్రతిసారి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చి పునీతులమవుతాము. కర్పూరం ప్రతి రోజు వెలిగించడం వలన ఆ ప్రదేశంలో ఏమైనా చెడు దృష్టి ఉంటె అది తగ్గిపోతుంది. కర్పూరం నుండి కూడా కొన్ని జలుబుకు సంభదించినా మందులు తయారుచేస్తారు.
అసలు ఈ కర్పూరం అనేది ఎలా తరాచేస్తారో తెలుసా…? అందరు కర్పూరాన్ని ఏమైనా కెమికల్ పదార్దాలు వాడి తయారుచేస్తారేమో అనుకుంటారు కానీ, దీని ఒక్క చెట్టు నుండి వచ్చే కలప నుండి తయారుచేస్తారు. కర్పూరాన్ని దాల్చిన చెక్క జాతికి చెందిన చెట్టు ఐన సిన్నమోమం కంఫోరా నుండి తాయారు చేస్తారు. ఈ చెట్టు ఎక్కువగా ఇండియా, చైనా మరియు జపాన్ దేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి.
మొదటగా ఈ చెట్టు యొక్క మందమైన కలపను తీసుకొని దాన్ని బాగా ఎండబెట్టి దాని పైన బెరడును తీసివేసి ఆ కలపను లేదా ఆ చెట్టు కట్టెను చిన్న చిన్న భాగాలు చేసి ఒక పెద్ద గిన్నెలో వేసి వేడి చేస్తూ, ఆ వేడి బయటకు పోకుండా ఎయిర్ టైట్ చేసి ఆ గిన్నెకి ఒక పైప్ అమర్చి, దాన్ని -20 డిగ్రీస్ ఉన్న కూలర్ లోకి పంపుతారు. ఎప్పుడైతే ఆవిరి ఈ పైప్ నుండి కూలర్ లోకి వేలిందో అక్కడ మనకు క్రిస్టల్ కర్పూరం తయారవుతుంది. దీని వడగట్టగా గట్టి ముద్దా కర్పూరం వస్తుంది. దీని ఒక మెషిన్లో వేసి చిన్న కర్పూర బిళ్లలుగా తయారుచేస్తారు